Janhvi Kapoor : సోషల్ మీడియా వాడకంలోకి సినిమా ఇండస్ట్రీకి సంబందించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. మరీ ముఖ్యంగా కొందరి కళ్లు ఎప్పుడూ ప్రముఖ తారలపైనే ఉంటాయి. అయితే ఉద్దేశ్యపూర్వకంగా అలా చేసిందో లేదో తెలియదు కానీ జాన్వీ కపూర్ చేసిన పని ఇప్పుడు నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ – టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా వ్యాపిస్తోంది. జాన్వీ కపూర్ తెలుగులో దేవర అనే సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తుంది.
జాన్వీ కపూర్ ఇప్పటివరకు బాలీవుడ్‌లో చాలా సినిమాలలో హీరోయిన్ గా పనిచేసింది. కానీ ఈమెకు మంచి పేరు తెచ్చే సినిమా ఒకటి కూడా లేకపోయింది. ఇలాంటి ఈమెకు తెలుగులో తన మొదటి చిత్రమే ఎన్టీఆర్ తో అంటే అదృష్టమే అని చెప్పాలి. జాన్వీ అభిమానులు దేవర చిత్రం పై బారి అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. అయితే జాన్వీ కపూర్ దేవర ఫైర్ పాటను పాటించుకోకుండా పుష్ప 2 పాట ప్రమోషన్ చేసింది.
ఈ విషయం సోషల్ నెట్‌వర్క్‌లలో సంచలనం సృష్టించింది. దేవర సినిమాను జాన్వీ కపూర్ అగౌరవపరిచిందని, ఆమెకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ లేదని, పుష్ప 2పై పూర్తిగా దృష్టి పెట్టిందని, ఎన్టీఆర్ అభిమానులు జాన్వీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ కు పుష్ప సాంగ్ నచ్చవచ్చు, కానీ ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రాల అప్‌డేట్‌లకు స్పందించకపోవడం నిజంగా బాధాకరంగా ఉందని అభిమానులు అంటున్నారు. జాన్వీ కపూర్ ను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.