Home Cinema Mahesh Babu : అరుదైన రికార్డు అందుకున్న మహేష్ బాబు.. అందుకే సూపర్ స్టార్ అయ్యారు..

Mahesh Babu : అరుదైన రికార్డు అందుకున్న మహేష్ బాబు.. అందుకే సూపర్ స్టార్ అయ్యారు..

Mahesh Babu : ఒకడు లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేష్ బాబు హీరోగా నిజం సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మంచి ఫామ్‌లో ఉన్న తేజ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఒక్కడు సినిమా విజయం తర్వాత మహేష్ కూడా స్టార్ హీరో అయ్యాడు. అయితే మహేష్ బాబు నిజంపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే ఫస్ట్ షోపై నెగిటివ్ టాక్ వచ్చింది.

అయితే, ఈ సినిమా సమ్మర్ సీజన్లో విడుదలైంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద కొంత వసూలు సాధించింది. ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికి మంచి ఫలితం పొందింది. ఈ విషయంపై దర్శకుడు తేజ ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చాడు. తేజ మాట్లాడుతూ, నేను తీసిన నిజం సినిమా ప్లాప్ టాక్ వచ్చినప్పటికి అప్పట్లో అది బ్రేక్ ఈవెన్ అయ్యింది అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతే కాదు ఈ సినిమా 71 థియేటర్లలో 50 రోజులు, 13 థియేటర్లలో 100 రోజులు నడిచింది.

mahesh-babu-achieved-rare-record-in-his-career

ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. విలన్‌గా కూడా గోపీచంద్ ఇరగదీసారు అని చెప్పొచ్చు. ఈ సినిమా మే 23, 2003న విడుదలైంది. అంటే ఈ సినిమా నేటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది మరియు మహేష్ బాబు ఇలా కూడా చేయగలదని నిరూపించింది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి తో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని నడుస్తుంది. మహేష్ – రాజమౌళి మొదటిసారి కలిసి పని చేయడంతో ఈ సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version