Home Cinema NTR : ఆ సినిమా నుండి తప్పుకున్న ఎన్టీఆర్..? ఆందోళనలో అభిమానులు..

NTR : ఆ సినిమా నుండి తప్పుకున్న ఎన్టీఆర్..? ఆందోళనలో అభిమానులు..

ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుడటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవ్వనుంది.

ఇక ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే లెక్క ప్రకారం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా తెరపైకి రావాలి. కానీ ఎన్టీఆర్ వార్ 2 పై ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఆ సినిమానే చేదాం దేవర తరువాత అని అనుకుంటున్నాడు అట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా సాలార్ 2 తెరకేకించే పనిలో ఉన్నాడు. ఇక ఎన్టీఆర్, ప్రస్థానీలు కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ప్రస్తుతానికి ఆగినట్టే అని అంటున్నారు.

ntr

దేవర రెండు భాగాలు పూర్తి అయిన తరువాత ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఎన్టీఆర్ కూడా ఆ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. ఇది తెలుసుకుని అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త పై అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఎం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version