Home Cinema Anupama : అలాంటి సీన్స్ లో నటించటం తప్పేమి కాదు.. డైరెక్టర్ ఏది అడిగితే అది...

Anupama : అలాంటి సీన్స్ లో నటించటం తప్పేమి కాదు.. డైరెక్టర్ ఏది అడిగితే అది చేయాలి..

Anupama Parameswaran : టిల్లు స్క్వేర్ థియేటర్ లలో ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న సినిమా. 2022 లో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమానే ఇది. హీరో సిద్ధూ జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇద్దరి నటన మరియు కథ ఈ సినిమాలోని చాల పెద్ద పాజిటివ్ పాయింట్ అనే చెప్పొచ్చు. రిలీజ్ అయిన వారం రోజులలోనే దాదాపు 100 కోట్ల కలెక్షన్ అందుకుంది ఈ సినిమా. ఈ దెబ్బతో ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్ ఐపోయారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అనుపమను స్వయంగా అభిమానులే చాలా ట్రోల్ చేసారు. దీనికి కారణం తమకు ఇష్టమైన హీరోయిన్, ఎప్పుడు పద్ధతిగా కనిపించే అనుపమ ఈ సినిమాలో టూ బోల్డ్ గా కనిపించటమే దానికి కారణం. అభిమానులు అనుపమను లిల్లీ క్యారెక్టర్ లో జీర్ణించుకోలేక పోయారు. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత అందరి నోర్లని మూయించి మంచి పేరు తెచ్చుకుంది అనుపమ.

siddu-anupama-tillu-square

మొన్న సక్సెస్ మీట్ లో అనుపమ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాల ట్రెండ్ అవుతున్నాయి. అనుపమ మాట్లాడుతూ కిస్ సీన్ లలో నటించటం తప్పేమి కాదు, కథ ఏది డిమాండ్ చేస్తే అది చేయాలి. అయినా ఎప్పుడు ఒకేలాంటి పాత్రలు చేసి నాకు చాల బోర్ కొట్టేసింది అందుకే ఈ సారి కొంచం బిన్నంగా చేదాం అని ఫిక్స్ అయ్యి ఈ సినిమా చేశాను. నన్ను ఎంతగానో అభిమానించి ఈ సినిమాను ఆదరించిన మీ అందరికి నా వందనం అంటూ ముగించింది అనుపమ.

Exit mobile version