Home Cinema NTR: చాలా హర్ట్ అయిన ఎన్టీఆర్ భర్య లక్ష్మి ప్రణతి.. వారికి సీరియస్ వార్నింగ్..?

NTR: చాలా హర్ట్ అయిన ఎన్టీఆర్ భర్య లక్ష్మి ప్రణతి.. వారికి సీరియస్ వార్నింగ్..?

NTR: కుటుంబమే లోకం అనుకుంటూ బ్రతికే సీలెబ్రిటీస్ లో ఒకరు లక్ష్మీ ప్రణతి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య గా ఈమెకి సోషల్ మీడియా లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన భర్త, పిల్లలే లోకం గా బ్రతుకుతూ, భార్య అంటే ఇలా ఉండాలి అని నలుగురికి అనిపించేలా ఆదర్శంగా నిల్చిన స్త్రీ ఆమె. అయితే ఎన్టీఆర్ పెళ్లి ఎన్నో వివాదాల నడుమ జరిగింది అనే విషయం మన అందరికీ తెలిసిందే(Ntr wife angry). 18 ఏళ్ళు కూడా నిండని మైనర్ బాలిక అయినా లక్ష్మీ ప్రణతి ని జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నాడు, ఇది చట్టరీత్య నేరం అంటూ అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది.

ntr-lakshmi-pranathi

దీనిపై సోషల్ మీడియా లో కూడా ఎన్టీఆర్ దురాభిమానులు ఇప్పటికీ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసే సమయం లో ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు చేసిన కొన్ని కామెంట్స్ పై ప్రణతి చాలా ఫైర్ అయ్యిందట. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ని పెళ్లి చేసుకున్నప్పుడు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి(Ntr wife angry). దీంతో సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు అప్పట్లో ప్రణతి ని ఈ విషయమై ఐరన్ లెగ్ అంటూ బాగా ట్రోల్ చేసారు. ఇది లక్ష్మి ప్రణతి కి తెలిసి బాగా హర్ట్ అయ్యిందట.

ఎన్టీఆర్ పీఆర్ టీం ని పిలిచి ఎవరు ఇలా చేస్తుంది, నేను రావడం వల్ల ఎన్టీఆర్ కి ఫ్లాప్స్ రావడం ఏమిటి అంటూ తిట్టిందట. ఇక నుండి ఇలాంటి కామెంట్స్ చేస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పిందట. ఎప్పుడూ ఎంతో కూల్ గా అసలు నోట్లో నాలుక ఉందా అని అనిపించే లక్ష్మీ ప్రణతి కి ఇంత కోపం వస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయారట అప్పట్లో. అంతే కాదు , తన మీద వేసిన ఆ నెగటివ్ పోస్ట్స్ అన్నిటిని సోషల్ మీడియా నుండి తొలగించింది అట. అప్పటి నుండి అభిమానులు ఇలాంటి కామెంట్స్ కి దూరం గా ఉంటూ వస్తున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన హ్రితిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే చిత్రం లో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవ్వనుంది.

RRR తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా పై అభిమానులకి బారి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు ఎన్టీఆర్ ది దీనితో ఫాన్స్ కసి మీద ఉన్నారు. జాన్వీ కప్పొర్ కి కూడా ఇదే మొదటి తెలుగు సినిమా.

Exit mobile version