Home Cinema Pawan Kalyan : నెగటివ్ టాక్ తో బంపర్ ఓపెనింగ్స్..పవర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించిన...

Pawan Kalyan : నెగటివ్ టాక్ తో బంపర్ ఓపెనింగ్స్..పవర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్ ‘ చిత్రం నిన్ననే గ్రాండ్ గా విడుదలై ఆడియన్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్(Pawan Kalyan Bro Collections) టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాలో పాటలు మరియు ఫైట్స్ లేకపోవడం వల్లే ఆ టాక్ వచ్చిందని, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగానే మొదటి రోజు ఓపెనింగ్ అదరగొట్టింది. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కళకళలాడిపోయాయి.

pawan-kalyan-bro-movie-collections-are-huge-numbers-without-negative-talks

ముఖ్యంగా సాయంత్రం మరియు రాత్రి షోస్ అయితే చెత్త థియేటర్స్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ స్థాయిలో ఈమధ్య కాలం లో పాన్ వరల్డ్ హైప్ తో వచ్చిన సినిమాలకు కూడా అవ్వలేదనే చెప్పాలి. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 9 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ కి చాలా తక్కువే అని చెప్పాలి. కానీ తెలంగాణ వ్యాప్తంగా వరదలు ఉండడం, దానికి తోడు మూడు హాలీవుడ్ సినిమాలతో పాటుగా ‘బేబీ ‘ చిత్రం కూడా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుండడం తో ఈ చిత్రానికి షోస్ బాగా తక్కువ వచ్చాయి. ఫలితంగానే అలాంటి తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి టికెట్ రేట్స్ లేకపోయినా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ఈ సినిమాకి మొదటి రోజు 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇకపోతే ఈ చిరానికి(Pawan Kalyan Bro Collections) రెండవ రోజు చాలా ప్రాంతాలలో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. సినిమా కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి టాక్ ఉందని, అందుకే లాంగ్ రన్ లో దుమ్ము లేపే రేంజ్ వసూళ్లను దక్కించుకోవడం పక్కా అని అంటున్నారు.

మరి ఈ సినిమా ఫేట్ ఏమిటో తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. సోమవారం ఈ చిత్రానికి స్టడీ కలెక్షన్స్ వస్తే లాంగ్ రన్ వంద కోట్లు కొడుతుందని అని ట్రేడ్ పండితులు అనుకుంటున్నారు. చూడాలి మరి.

Exit mobile version