Pooja Hegde: పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యూనరేషన్ ని తీసుకునే హీరోయిన్స్ లో ఒకరిగా ప్రముఖ హీరోయిన్ పూజ హెగ్డే కి ఎంత మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ‘ఒక లైలా కోసం’ అనే చిత్రాంమ్ ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ సినిమా హిట్టైన తర్వాత వరుసగా క్రేజ్ ఆఫర్స్ ని దక్కించుకొని మూడవ సినిమాతోనే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదట్లో ఆమెకి పెద్దగా విజయాలు రాలేదు.
దీనితో కొంతకాలం విరామం తీసుకొని అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాధం ‘ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజి గా ఆడింది కానీ, పూజ హెగ్డే కి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు వచాయి. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ అతి తక్కువ కాలం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా, తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోయింది. కానీ ఈమధ్య ఈ హాట్ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ఒక్క దాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చి , పూజ హెగ్డే కెరీర్ ని డైలమా లో పడింది.
రీసెంట్ గానే ఈమె(Pooja Hegde) బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో ఈ హాట్ బీటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఒప్పుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం ‘ నుండి కూడా తీసేసారు. కొత్త హీరోయిన్ శ్రీలీల జోరు వల్ల పూజ హెగ్డే డిమాండ్ ఇలా పడిపోయిందని అందరూ అంటున్నారు. పూజ హెగ్డే కి ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ డిమాండ్ చెయ్యడం.
అదే సమయం లో ఆమె కంటే తక్కువ రెమ్యూనరేషన్ కి శ్రీలీల దొరకడం తో అందరూ ఆమెవైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇకపోతే సినిమా అవకాశాల్లో తాను ఎలాంటి పాత్ర్ర చేయడానికైనా సిద్ధం అనే విధంగా నిర్మాతలకు సంకేతం ఇస్తుంది . రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఈమె ‘బ్రా’ లేకుండా ఫోటోలు దిగడాన్ని చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది వరకు ఆమె ఈ రేంజ్ లో ఎప్పుడు కనిపించలేదు. మరి ఈమె చేసే ఈ ఫోటో షూట్ చూసి దర్శక నిర్మాతలు మళ్ళీ ఆమెకి అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.