Home Cinema Catherine Tresa: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేథరీన్ థెరీసా.. ఆ స్టార్ హీరోనే పెళ్ళికొడుకు..

Catherine Tresa: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేథరీన్ థెరీసా.. ఆ స్టార్ హీరోనే పెళ్ళికొడుకు..

Catherine Tresa Marriage: ఈమధ్య టాలీవుడ్ లో ఎక్కడ చూసినా పెళ్లి భాజాలే వినిపిస్తున్నాయి. ఎప్పటి నుండో పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోలు హీరోయిన్లు ఇప్పుడు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటూ సరికొత్త జీవితం లోకి అడుగుపెడుతున్నారు. రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు నిశ్చితార్థం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా మరో హాట్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, కేథరీన్ థెరీసా. ఈమె అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.

catherine-tresa-marriage

తొలిసినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసినప్పటికీ కూడా ఈమెకి మంచి పేరు వచ్చింది. ఎవరు ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అందరూ అనుకున్నారు. భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది అని కూడా అనుకున్నారు. సినిమాల్లో అవకాశాలు అయితే బాగానే వచ్చాయి కానీ, అన్నీ సెకండ్ హీరోయిన్ రోల్స్ మాత్రమే ఈమెకి దక్కాయి. ఒకటి రెండు సినిమాల్లో విలన్ రోల్స్ కూడా మెప్పించింది. ఈమె(Catherine Tresa Marriage) క్యాలండర్ లో ఒక్క నెల కూడా ఖాళీగా ఉన్నట్టు మనకి కనిపించదు. తెలుగు , తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మన టాలీవుడ్ లో ఎక్కువగా ఈమె అల్లు అర్జున్ తో సినిమాలు చేసింది.

‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం తర్వాత ఈమె అల్లు అర్జున్ తో ‘సర్రైనోడు’, ‘రుద్రమదేవి’ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించింది కానీ, అన్నీ సెకండ్ హీరోయిన్ రోల్స్ మాత్రమే దక్కాయి. అయితే త్వరలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమాలకు టాటా చెప్పబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. తన చిన్ననాటి స్నేహితుడితో గత కొంతకాలం నుండి డేటింగ్ లో ఉంటున్న కేథరిన్, ఈ ఏడాది లోనే పెళ్లి పీటలు ఎక్కడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకోబోతుందని సమాచారం.

మరి ఎవరు ఆ లక్కీ బాయ్ అనే విషయం కూడా ఆమె చెప్తుందో లేదో చూద్దాం. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించిన కాథరిన్ థెరీసా, ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. కేథరీన్ థెరీసా తెలుగు లో చివరిగా కనిపించిన సినిమా వాల్టాయిర్ వీరయ్య. ఈ సినిమాలో కేథరీన్ ఒక చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమా తరువాత ఎన్నో కొన్ని అవకాశాలు వస్తాయని అనుకున్న కేథరీన్ ఆశలు నిర్యాశలు అయ్యాయి అనే చెప్పుకోవాలి.

Exit mobile version