Home Cinema Pooja Hegde: అవకాశాలు రావటానికి వేణు స్వామి తో హీరోయిన్ పూజ హెగ్డే పూజలు..

Pooja Hegde: అవకాశాలు రావటానికి వేణు స్వామి తో హీరోయిన్ పూజ హెగ్డే పూజలు..

Pooja Hegde-Venu Swamy: ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసి ఆ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక వరుసగా అవకాశాలు సంపాదించి మధ్యలో ఫ్లాప్స్ రావడం తో కొంతకాలం సినిమా ఇండస్ట్రీ కి బ్రేక్ ఇచ్చి, మళ్ళీ అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. వరుసగా క్రేజీ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు దక్కించుకొని అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

pooja-hegde-venu-swamy

ఇక ఆ తర్వాత తమిళం లో, హిందీ భాషల్లో కూడా పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ ని అందుకొని పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈమధ్య పూజా హెగ్డే కి ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆమె ముట్టుకున్న ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతుంది. చివరికి చేతికి అందిన క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా చెయ్యి జారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. అసలు ఈ అమ్మాయికి ఏమైంది? ఎందుకు ఈమె జాతకం ఇలా తిరగబడింది, స్టార్ హీరోలందరూ ఈమె డేట్స్ కోసం క్యూ కట్టే రేంజ్ నుండి, అసలు అవకాశాలే లేకుండా పోవడానికి కారణం ఏమిటి అని ఆమె అభిమానులు బాధ పడుతూ ఉన్నారు.

అయితే తన జాతకం లో ఎదో దోషం ఉందని భావించిన పూజ హెగ్డే, ప్రముఖ జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి ని కలిసి దోష నివారణ పూజ చేయించడానికి సన్నాహాలు చేస్తుందట(Pooja Hegde Venu Swamy). దీనికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈమధ్య కాలం లో హీరోయిన్స్ అందరూ ఇలాంటి పూజలు చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూజ హెగ్డే కూడా అలాంటి ఆ జాబితాలోకి చేరిపోయింది. మరి ఈ పూజ తర్వాత అయినా ఆమె జాతకం మారుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.

సాయి దరం తేజ్, శర్వానంద్ తో సినిమాలు చేస్తుంది అని వార్తలు వచ్చాయి కానీ, దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రేంజ్ హీరోలతో చెయ్యాల్సిన పూజా హెగ్డే ఇంత దారుణంగా పడిపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఆమె కం బ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవలే పూజ హెగ్డే కి త్రివిక్రమ్ మల్లి ఒక మూవీ ఛాన్స్ ఇచ్చాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సాయి ధరమ్ తేజ్ హీరో గా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజ ని హీరోయిన్ గా కంఫర్మ్ చేసేసాడు అంట. కానీ ఇంకా ఏ అధికారిక ప్రకటన ఐతే వెల్లడించలేదు. ఫాన్స్ వేచి చూడాల్సిందే.

Exit mobile version