Home Cinema Poonam : డైరెక్టర్ త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ వివాదాస్పద కామెంట్స్.. నేటిన్ట్లో హల్చల్..

Poonam : డైరెక్టర్ త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ వివాదాస్పద కామెంట్స్.. నేటిన్ట్లో హల్చల్..

Poonam : టాలీవుడ్ లో హీరోయిన్ గా గతంలో పలు చిత్రాల్లో కనిపించిన హీరోయిన్ పూనమ్ కౌర్ తెలుగుగు వారికీ సుపరిచితురాలు. ముఖ్యంగా త్రివిక్రమ్ పై ఈ క్యూటీ తనదైన స్టైల్ లో సెటైర్లు వేయడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే హీరో సాయిధరంతేజ్ మూడు రోజులుగా సోషల్ మీడియాలో మినీ వార్ చేస్తున్నాడు. ముఖ్యంగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై చర్య తీసుకోవాలని తేజ్ గవర్నమెంట్ కోరుతూ తెలంగాణ సిఎం, డిప్యూటీ సిఎం మరియు మహిళా కమీషనర్‌లను ట్యాగ్ చేశాడు.

సాయి ధరంతేజ్ పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంతేకాదు పూనమ్ కౌర్ గట్టి ప్రతీకార చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రేప్ విషయంపై తేజకు సెట్టైర్ వేస్తూ ఓ నెటిజన్ జల్సా సినిమాలోని ఓ సన్నివేశాన్ని చూపించాడు. ఈ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ ఇలా అంటాడు. పడుకున్న అమ్మాయిని ఎం రేప్ చేస్తాం అని. ఇలాంటి డైలాగ్ల వల్లనే యువత అంతా చెడిపోతారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నాడు.

poonam-kaur-comments-on-trivikram-is-trending-on-social-media

ఈ విషయంపై ఓ యూజర్ చేసిన ట్వీట్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా స్పందించింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాసాడు. అంతకంటే బెటర్ అతనేమీ రాయలేడు అని త్రివిక్రమ్ ను కించపరుస్తూ మాట్లాడిని పూనమ్. అతని నుండి ఇంకేమీ ఆశించవద్దు. చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఈ అంశంపై వివిధ మార్గాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పూనమ్ సమయం దొరికినప్పుడల్లా, ఆమె అలాంటి సెట్టైర్లు త్రివిక్రమ్ పై వేస్తుంది. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో చేర్చాయాంశం గా మారింది.

Exit mobile version