Home Cinema Big Boss: బిగ్ బాస్ తెలుగు 7 లోకి బ్యాంకాక్ పిల్ల.. ఈసారి ఎంటర్టైన్మెంట్ మామూలు...

Big Boss: బిగ్ బాస్ తెలుగు 7 లోకి బ్యాంకాక్ పిల్ల.. ఈసారి ఎంటర్టైన్మెంట్ మామూలు రేంజ్ లో ఉండదు..

Big Boss: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ సృష్టించిన సెన్సేషన్ మామూలుది కాదు. మన టాలీవుడ్ కంటే ముందే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో బాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యింది. అక్కడ సల్మాన్ ఖాన్ ఈ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఈ షో ని తెలుగు లో ట్రై చేసారు (Bangkok Pilla Big Boss). ఇక్కడ సక్సెస్ అవుతుందో లేదో అన్న భయం తోనే ప్రారంభించారు. కానీ మొదటి సీజన్ గ్రాండ్ హిట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన సీజన్స్ ఒక దానిని మించి ఒకటి సక్సెస్ సాధించడం, అలా అదే సక్సెస్ ని కొనసాగిస్తూ 6 సీజన్స్ పూర్తి చేసుకుంది.

bangkok-pilla-big-boss

ఇప్పుడు 7 వ సీజన్ ని ప్రారంభం అయ్యేందుకు రంగం మొత్తం సిద్ధం అయ్యింది. రీసెంట్ గానే కమింగ్ సూన్ అంటూ ఒక ప్రోమో కూడా వేశారు. అయితే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ గత కొంత కాలం గా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అయ్యింది. దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం కచ్చితంగా ఖరారు అయ్యారు అంటూ పేర్లు వినిపిస్తున్నాయి, వారిలో ఒకరు బ్యాంకాక్ పిల్ల (Bangkok Pilla Big Boss). ఈ ఛానల్ ద్వారా ప్రముఖ యూట్యూబర్ శ్రావణి సమంత పూడి మంచి పాపులారిటీ ని దక్కించుకుంది.

బ్యాంకాక్ లో పర్యటిస్తూ,అక్కడ షూటింగ్స్ చేస్తూ వీడియోస్ ని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోస్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా ఈ వీడియోస్ లో శ్రావణి తెలుగు యాస కి నెటిజెన్స్ పెద్ద ఫ్యాన్స్. విజయ నగరం జిల్లాకి చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇందుకోసం గా ఆమె రీసెంట్ గా ఇండియా కి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా 25 కంటెస్టెంట్స్ ని తీసుకోబోతున్నారని, వైల్డ్ కార్డు ఎంట్రీ మరియు సీక్రెట్ రూమ్స్ గత రెండు సీజన్స్ లో లేవు కనుక, ఈ సీజన్ లో ఆ రెండు ఉండబోతున్నాయని తెలుస్తుంది.

చూదాం ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు రాబోతున్నారో, లాస్ట్ సీసన్ అట్టర్ ప్లాప్ అవ్వటంతో ఈ సారి మంచి పాపులారిటీ ఉన్న వారినే తీసుకువస్తారు అని చాల గుస గుసలు వినిపిస్తున్నాయి. బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ లోకి రావటం చాల ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. 20 లక్షల ఫాలోయర్స్ ఉన్న ఈ యూట్యూబేర్ ఛానల్ మొదలు పెట్టిన 9 నెలలుకె ఇంత పెద్ద సక్సెస్ పొందింది. మరి తిను బిగ్ బాస్ కి వచ్చి పేరు ఇమేజ్ కాపాడుకుంటుందా లేదా ఖరాబు చేసుకుంటుందా వేచి చూడాల్సిందే మరి.

Exit mobile version