Home Cinema 48 ఏళ్లకే గుండెపోటుతో కన్ను మూసిన ప్రముఖ టీవీ నటుడు..

48 ఏళ్లకే గుండెపోటుతో కన్ను మూసిన ప్రముఖ టీవీ నటుడు..

popular-tv-actor-vikas-sethi-passed-away-at-age-48-due-to-heart-attack

Vikas Sethi Death : ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ వికాస్ సేథీ అకాల మరణం యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. కేవలం 48 ఏళ్ళ వయస్సులోనే ఆయన ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అత్యంత బాధకు గురి చేస్తున్న విషయం. ప్రముఖ నటులు స్మృతి ఇరానీ, ఏక్తా కపూర్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిన టీవీ షో ‘క్యున్కి సాస్ భీ కభీ బహు ధీ’ లో పని చేసాడు. ఈ షో సుమారుగా ఎనిమిదేళ్ల పాటు నడిచింది. వికాస్ సేథీ ఈ షో ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ ఫేమ్ తో ఆయనకు ‘కహీన్ తో హోగా’ లో నటించాడు.

ఇది కూడా చాలా పెద్ద హిట్టై వికాస్(Vikas Sethi Death) కి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. ఈ సీరియల్ కంటే ముందే ఆయన 2001 వ సంవత్సరంలో ‘కసౌథీ జిందగీ’ అనే సీరియల్ లో కూడా నటించాడు. ఇందులో ఆయనతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా నటించారు. అయితే ఇంత చిన్న వయస్సులో వికాస్ చనిపోవడానికి కారణాలు ఏమిటి అని అభిమానులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, ఆయన నిద్రపోతున్న సమయంలోనే గుండెపోటు వచ్చి చనిపోయినట్టు తెలుస్తుంది.

కానీ ఇప్పటి వరకు వికాస్ మరణ వార్త గురించి అతని భార్య మరియు ఇతర కుటుంబ సభ్యులు మీడియా తో ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. ఇది ఇలా ఉండగా వికాస్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈయన 1976 మే 12 వ తేదీన చండీగఢ్ లో జన్మించాడు. జాన్వీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయనకు కవల పిల్లలు జన్మించారు. తన పిల్లలంటే వికాస్ కి పంచ ప్రాణాలు. వాళ్ళను ఎంతో ప్రేమగా చూసుకునే వాడు.

పిల్లలకు కూడా వికాస్ అంతే ఎంతో ప్రేమ, ఇప్పుడు వాళ్ళను అన్యాయంగా అనాథలను చేసి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా వికాస్ కేవలం సీరియల్స్ లోనే కాదు, సినిమాల్లో కూడా నటించాడు. 2001 వ సంవత్సరం లో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ ‘కభీ ఖుషి కభీ గమ్’ సినిమాలో నటించాడు. ఇందులో ఆయన కరీనా కపూర్ కి స్నేహితుడిగా కనిపిస్తాడు. ఇవి కాకుండా వికాస్ తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించాడు. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించాడు.

Exit mobile version