Home Cinema Tamannaah: నటి తమన్నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్..? నిజమే అంటున్న తమన్నా..

Tamannaah: నటి తమన్నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్..? నిజమే అంటున్న తమన్నా..

actress-tamannaah-bhatia-breakup-with-boyfriend-vijay

Tamannaah Bhatia Break Up నాలుగు పదుల వయస్సుకు దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ చెక్కు చెదరని సౌందర్యం తో, తరగని డిమాండ్ తో ఇండస్ట్రీ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. మంచు మనోజ్ హీరో గా నటించిన శ్రీ అనే చిత్రం ద్వారా ఈమె తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాకపోవడంతో తమన్నా పేరు పెద్దగా ఇండస్ట్రీ లో వినపడలేదు. దీంతో ఆమెకి అవకాశాలు కూడా రాలేదు. కానీ తమిళం నుండి అవకాశాలు వచ్చాయి. అక్కడ ఈమెకి రవికృష్ణ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన ‘కేడి’ చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ కాలేకపోయినా తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమెకి అవకాశాలు కూడా క్యూ కట్టెలాగా చేసాయి. అలా తమిళం పలు సినిమాలు చేస్తున్న తమన్నా కి, తెలుగులో హ్యాపీ డేస్ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా అప్పట్లో ఒక సునామీ ని సృష్టించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా తర్వాత తమన్నా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే డిమాండ్ తో ఇండస్ట్రీ లో కొనసాగుతుంది.

ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో గత కొంతకాలం నుండి డేటింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పెళ్లిపై నాకు ఇప్పుడే తొందర లేదు, ముందు కెరీర్ మీదనే నా ద్రుష్టి ఉంది అంటూ మాట్లాడడం పెద్ద చర్చకు దారి తీసింది.

అంతే కాకుండా తన బ్రేకప్ లవ్ స్టోరీస్(Tamannaah Bhatia Break Up) గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నేను టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డాను, కానీ అతని లోకం వేరు, నా లోకం వేరు, అతని లోకంలోకి నేను వెళ్లాలంటే నాకు ఇష్టమైన లోకాన్ని పూర్తిగా వదిలేయాలి, అది నాకు ఇష్టం లేదు, అందుకే అతన్ని వదిలేసాను. రెండవ సారి కూడా ప్రేమలో పడ్డాను, కానీ ఈసారి మాత్రం నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రతీ చిన్న దానికి అబద్దం చెప్పడం వల్ల విసుగెత్తి పోయాను. అందుకే వదిలేసాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version