Home Cinema Mahesh Babu – Rajamouli : మహేష్ బాబుకి చుక్కలు చూపిస్తున్న రాజమౌళి.. సినిమాకు ముందే...

Mahesh Babu – Rajamouli : మహేష్ బాబుకి చుక్కలు చూపిస్తున్న రాజమౌళి.. సినిమాకు ముందే ఇలా..

Mahesh Babu – Rajamouli : మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు మరియు ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా పూర్తి అయ్యాక మహేష్ బాబు రాజమౌళి (Rajamouli Mahesh Babu Film) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. త్రివిక్రమ్ తన సినిమా పూర్తి చేయకముందే రాజమౌళి మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పని మొదలు పెట్టారట.

rajamouli-started-torturing-mahesh-babu-as-director-planned-training-session-to-hero-before-going-to-sets

వచ్చే దసరాకు వీరి కంబినేషన్లో వచ్చే సినిమా షూటింగ్ మొదలు పెడతారట రాజమౌళి. అంత కంటే ముందు మహేష్ ఓ ట్రైనింగ్ పూర్తి చేయాలట. అందుకుగాను మూడు నెలల టైం షూటింగ్ కు ముందు కేటాయించాల్సివస్తుంది అని రాజమౌళి కండిషన్ పెట్టాడంట. /వీరి కాంబినేషన్ లో సినిమా కోసం వీరి అభిమానులు వేయి కళ్ళతో చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీరి కోరిక ఇప్పుడు తీరబోతుంది. ఈ సినిమా ఫుల్ లెన్త్ ఆక్షన్ డ్రామాగా ఉండబోతుంది అని రాజమౌళి అన్నారు మరియు

స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన ఇంకో ఇంటరెస్టింగ్ విషయం కూడా బయటపెట్టారు. అదేంటంటే, మహేష్ సినిమా స్ట్రోక్ రెండు భాగాలుగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నం అని ఆయన అన్నారు. దీనితో ఫాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంతకీ ఈ సినిమా షూటింగ్ కు ముందు మహేష్ చేసే ట్రైనింగ్ ఇక్కడ ఉంటదో మరి విదేశాలలో ఉంటదో ఇంకా తెలీదు. ఈ ట్రైనింగ్ కోసం టైం కేటాయించాలంటే త్రివిక్రమ్ తన సినిమాను అనుకున్న టైంకు అయిపోకొట్టాలని మహేష్ చెప్పారంట.

RRR కి ముందు ఇలానే జక్కన తన హీరోలను రెండు నెలల ముందు ట్రైనింగ్ కు పంపారట. ఇలా చేయడం వలన హీరోలు సినిమా సెట్స్ మీదకు పోక ముందే క్యారక్టర్ లో ఉంటారని ఆయన నమ్ముతున్నారు. అందుకే మహేష్ (Rajamouli Mahesh Babu Film) కూడా ఎట్టి పరిస్థితులలో ఈ ట్రైనింగ్ మిస్ చేయొద్దు అని డిమాండ్ చేశారట.

ఏదిఏమైనా జక్కన చెప్పినట్లు చేస్తే సినిమాను ఎక్కడికో తీసుకపోతారని మహేష్ నమ్ముతున్నారు మరియు అయినా చెప్పిన ప్రతి దానికి ఓకే చెపుతున్నారు. ఇదంతా చదివిన మహేష్ ఫాన్స్ మాత్రం రాజమౌళి మహేష్ బాబును ఇప్పటి నుండే టార్చర్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version