Home Cinema Prabhas: కాజల్ కి అవి ఉన్నాయి రకుల్ కి లేవు.. ఏంటి ప్రభాస్ ఇంతమాట అనేశాడు..

Prabhas: కాజల్ కి అవి ఉన్నాయి రకుల్ కి లేవు.. ఏంటి ప్రభాస్ ఇంతమాట అనేశాడు..

Prabhas: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అంటే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ ఒక్కరు ముక్తకంఠం తో చెప్పే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకి 150 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన చేసిన ప్రతీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి(Prabhas Rejects Rakul Preet). కానీ ఆ ఫ్లాప్స్ కూడా తన తోటి స్టార్ హీరోల హిట్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడాన్ని చూసిన ట్రేడ్ పండితులు, ఫ్లాప్ మూవీ కి ఇంత వసూళ్లు వస్తే, ఇక ప్రభాస్ సినిమా హిట్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆశ్చర్యపోతున్నారు.

prabhas-kajal-agarwal-rakul-preet

ప్రభాస్ కి ఈ రేంజ్ ఒక్క సినిమాతోనే రాలేదు. అంచలంచలుగా చిన్న హీరో స్థాయి నుండి ఇలా ఖాన్స్ తో పోటీ పడే రేంజ్ కి ఎదిగాడు. ఊర మాస్ ఇమేజి తో దూసుకెళ్తున్న రోజుల్లో ప్రభాస్ కి వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. అలాంటి సమయం లో ఆయనకి యూత్ ఆడియన్స్ కి దగ్గరగా చేసిన చిత్రం ‘డార్లింగ్’. కరుణాకరన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో పెద్దగా అంచనాలే లేకుండా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంత చక్కగా నటించిందో మన అందరికీ తెలిసిందే.

అయితే ఈ పాత్ర కోసం తొలుత కాజల్ అగర్వాల్ ని అనుకోలేదట. రకుల్ ప్రీత్ సింగ్ ని అనుకున్నారట. అయితే ప్రభాస్ కి మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ నచ్చలేదు(Prabhas Rejects Rakul Preet). ఈ పాత్ర కి ఆమె సరిపోదు, మగరాయుడి లాగ స్టైలిష్ గా ఉంది. మన సినిమాకి క్యూట్ గా ఉండే హీరోయిన్ కావాలి. అలాంటి లక్షణాలు కాజల్ అగర్వాల్ లో పుష్కలంగా ఉన్నాయి,ఆమెని ఈ సినిమాకి తీసుకోండి అని కరుణాకరన్ కి ప్రభాస్ సజస్ట్ చేసాడట. ప్రభాస్ మాటని కాదు అనకుండా కరుణాకరన్ కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఫలితం మన అందరికీ తెలిసిందే.

అప్పట్లోనే ఈ చిత్రం 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయితే ఆడియన్స్ ఆసక్తిగా పనులు మానుకొని మరీ టీవీ ముందు కూర్చుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అయలన్ అనే సినిమాలో నటిస్తుంది, ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయలేదు. తెలుగులో అవకాశాలు లేక వెళ్లి హిందీ సినిమా చేస్తుంది రకుల్ పాపా. ఎవరైనా డైరెక్టర్ పెద్ద మనసు చేసుకుని రకుల్ ని తెలుగు సినిమాల్లో తీసుకుంటే బాగుండు అని ఫాన్స్ ట్విట్టర్ లో తమ ఆవేదనను తెలుపుకుంటున్నారు.

Exit mobile version