Prabhas : సినిమా తీసే విధానం ఏదైనా కావచ్చు కానీ, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే విధానం పక్కాగా ఉండాలి. అప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుంది. హీరో డైరెక్టర్లు ఈ మధ్య తమ సినిమాలను బాగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ సినిమా కల్కి విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ ప్రమోషన్స్ లో సక్సెస్ సాధించలేకపోయాడు అంటూ టాక్ నడుస్తుంది. చాలా మంది ప్రభాస్ అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా భిన్నమైన ప్రొమోషన్స్ ను కల్కి సినిమా కోసం ప్రదర్శించారు.
ఈ సందర్బంగా ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రెండో ట్రైలర్ చూసిన అభిమానులు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని గుర్తించారు. చాలా చోట్ల ప్రీ-సేల్స్ ప్రారంభమైన తర్వాత, టిక్కెట్లు హాట్‌కేక్ లుగా అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితా బచ్చన్ మరియు దీపికా పదుకొణె ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రియాంక దత్, స్వప్నా దత్ స్టార్ క్యాస్ట్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ ను పెట్టారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రభాస్‌తో పాటు ఈ చాట్‌లో పాల్గొన్న చిత్రబృందం అంతా సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓపెన్‌గా పంచుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. బాహుబలి తర్వాత మళ్లీ ఈ సినిమాతో కామెడీ చేశాను. సినిమా సెకండాఫ్‌లో నా ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఈ క్యారెక్టర్ నా కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్ అని భావిస్తున్నాను అని ప్రభాస్ అన్నారు. దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరో మూడు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.