Home Cinema Vijayashanti : టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయశాంతి.. పుట్టిన రోజున సందర్బంగా ఫస్ట్ లుక్...

Vijayashanti : టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయశాంతి.. పుట్టిన రోజున సందర్బంగా ఫస్ట్ లుక్ రిలీజ్..

Vijayashanti : నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కళ్యాణ్ రామ్ 21వ చిత్రమైన ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ఎన్‌కెఆర్ 21తో నిర్మించబడుతుంది. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, క్రియేటర్స్ ఆమె పాత్రను తన పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

విజయశాంతికి ఎంతో పేరు తెచ్చిన వైజయంతి ఐపీఎస్ పాత్రలో మరోసారి నటించి తన సత్తా చాటుకోబోతుంది. ఈ చిత్రంలో ఆమెను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నారు డైరెక్టర్. కల్యాణ్‌ రామ్‌ విజయశాంతి గురించి అద్భుతమైన మాటలు పంచుకున్నారు. వైజయంతి ఐపీఎస్‌, ఓ స్ట్రాంగ్ పోలీసు పాత్ర అని, ఆ పాత్రకు తగినట్లే ఈ సినిమాలో కూడా స్ట్రాంగ్ గా ఉండబోతుంది అని తెలిపారు. సాయి మంజ్రేకర్‌ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

vijayashanti-in-nandamuri-kalyan-ram-cinema-nkr-21-firstlook-is-out

ఈ చిత్రంలో శ్రీకాంత్‌, సోహెల్‌ ఖాన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తుండగా అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు NKR-21 ను నిర్మిస్తున్నారు. విజయశాంతి చాలా రోజుల తరువాత వెండి తెరమీద కనిపించబోతుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని వరుసగా సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు తన అభిమానులు. ఇకపోతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయశాంతికి మా శుభాకాంక్షలు.

Exit mobile version