Home Cinema Prabhas : ఆ రెండు సినిమాల నుండి తప్పుకున్న ప్రభాస్..

Prabhas : ఆ రెండు సినిమాల నుండి తప్పుకున్న ప్రభాస్..

Prabhas : ప్రభాస్ ఈ పేరు తెలియని వారు మన భారత దేశంలో ఉండరు అనే చెప్పొచ్చు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు గ్లోబల్ స్టార్ అయ్యాడు ప్రభాస్. ఇండస్ట్రీ లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుస్తాడు ప్రభాస్, అందుకే ఇండస్ట్రీ మొత్తానికి ప్రభాస్ డార్లింగ్ ఐపోయాడు. ప్రభాస్ తో నటించిన ఎవరైనా సరే ప్రభాస్ గురించి చెప్పండి అంటే తన మంచితనం గురించి పొగుడుతూ ఉంటారు.

మొన్న రిలీజ్ అయిన సలార్ సినిమా ప్రభాస్ అభిమానులకు కన్నుల పండగ అనే చెప్పొచ్చు. ప్రభాస్ కొన్ని నెలల క్రితం తన కాలుకి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు మల్లి అది కొద్దిగా ఇబ్బంది పెట్టడం మొదలైంది అంట ప్రభాస్ కి. ప్రస్తుతం 4 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇవన్నీ ఆక్షన్ సినిమాలు కావటంతో కాలు సహకరిస్తోందా లేదా అని అనుకుంటున్నాడు అట ప్రభాస్.

prabhas

ఆరోగ్యమే ముందు అనుకోని ఒక రెండు సినిమాల నుండి తప్పుకుందాం అనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాలు సెట్ అయిన తరువాత మల్లి ఆ సినిమాలు తిరిగి ప్రారంబిద్దామ్ అనుకుంటున్నాడు ప్రభాస్. ఈ విషయం తెలిసి ఫాన్స్ తెగ ఫీల్ ఐపోతున్నారు, మరికొందరు ఫాన్స్ ఐతే ఆరోగ్యమే ముఖ్యం, సెట్ అయినతరువాతే చేయటం మంచిది అని అనుకుంటున్నారు.

Exit mobile version