Home Cinema Pushpa 2 : వెయ్యి కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిన పుష్ప మేకర్స్..

Pushpa 2 : వెయ్యి కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేసిన పుష్ప మేకర్స్..

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న స్టార్ స్టేటస్ ఏ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు. 80 ఏళ్ళు తెలుగు సినీ ప్రస్థానం లో ఏ స్టార్ హీరో కి కూడా సాధించని నేషనల్ అవార్డు ని అల్లు అర్జున్ సాధించాడు. ఆ విధంగా నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న మొట్టమొదటి తెలుగు హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదంతా పుష్ప సినిమా వల్లే జరిగింది(Pushpa 2 1000 crores). ఈ సినిమా హిందీ లో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. కేవలం రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను కేవలం హిందీ వెర్షన్ నుండి రాబట్టింది.

pushpa-2

అంతే కాదు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని దాదాపుగా ప్రతీ ఒక్క సెలబ్రిటీ ఎదో ఒక సందర్భం లో వాడుతూ వచ్చారు. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ఇక ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియోకి ఇండియా వైడ్ గా ఎలాంటి క్రేజ్ దక్కిందో అందరికీ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది.

అదేమిటంటే, ఈ సినిమాకి సంబంధించిన అన్నీ రైట్స్ మాకు హోల్ సేల్ గా అమ్మేస్తే వెయ్యి కోట్ల రూపాయిలు ఇస్తామంటూ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి ఆఫర్ ఇచ్చారట. కానీ మైత్రీ మూవీ మేకర్స్ అలా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా విలువ కేవలం వెయ్యి కోట్ల రూపాయిలు కాదు(Pushpa 2 1000 crores), అంతకు మించే ఉంటుంది, థియేటర్స్ లో విడుదల అయ్యాక బాక్స్ ఆఫీస్ సునామి మామూలు రేంజ్ లో ఉండదు అని మేకర్స్ బలంగా భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ డీల్ ని అప్పుడే క్లోజ్ చెయ్యడానికి సిద్ధంగా లేరట మైత్రి మూవీ మేకర్స్.

పుష్ప 1 మోదట్లో మన తెలుగు వాళ్ళకి అంత అనిపించలేదు కానీ నార్త్ వాళ్లకి ఈ సినిమా బాగా ఎక్కేసింది. మెల్లి మెల్లిగా మన వాళ్లకి ఈ సినిమా బాగా నచ్చింది అనే చెప్పాలి. పుష్ప 1 కె ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి అంటే, ఇంకా పార్ట్ 2 కి కలెక్షన్స్ మనం ఉహిచటం కుడి కష్టమే. సుకుమార్ కెరీర్ లోనే ఇది పెద్ద హిట్ గా ఉండబోతుంది. అంతే కాకుండా పార్ట్ 2 లో సాయి పల్లవి కూడా ఉండటం విశేషం.

తన పాత్ర ఏంటి అనేది ఇంకా వెల్లడించలేదు. పుష్ప 1 లో కూడా అమ్ముడికి ఆఫర్ వచ్చింది కానీ తన బిజీ షెడ్యూల్ వల్ల రిజెక్ట్ చేసింది ఈ సినిమా ని సాయి పల్లవి. మొత్తానికి పార్ట్ 2 లో దర్శనం ఇవ్వబోతుంది.

Exit mobile version