Home Cinema Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలంటే.. డేట్ లీక్..

Mahesh Babu : రాజమౌళి – మహేష్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలంటే.. డేట్ లీక్..

Mahesh Babu : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు నెటిజెనులు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా సెట్స్ పైకి పోతుంది అని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కలయికలో వచ్చే SSMB29 లాంచ్ మరియు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చింది. మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు దాటింది.

కానీ అతని సినిమా ఇంకా విడుదల కాలేదు మరియు అభిమానులలో ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. వివరాలోకి వెళితే మహేష్ బాబు తండ్రి, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తన తాజా ఇంటర్వ్యూలో SSMB29 ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందని స్పష్టంగా చెప్పలేదు. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా నెలలో సెట్స్ మీదకు వెళ్తుంది అని నమ్ముతున్నారు.

rajamouli-mahesh-babu-ssmb29-shooting-starts-on-this-date

అయితే ఆదిశేషగిరిరావు గుడ్ న్యూస్ తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ కూడా తెలియజేసారు. ఈ సినిమా పూర్తి చేయడానికి రెండేళ్లు పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో మహేష్ బాబు అభిమానుల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మహేష్ బాబు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుంది అంటే, మరో రెండేళ్లు వేచి చుడాలిసిందే. ఈ సినిమాను పిఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దాదాపు 700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, వారి ప్రకారం, బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version