Mahesh Babu : మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలలో ఒకరు. అతని తండ్రి కృష్ణ ఒకప్పుడు సినిమా రంగంలో గొప్ప హీరో. మహేష్ బాబు తన వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి హీరోగా పరిచామయాడు. మహేష్ హీరోగా నటించే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పట్లో ఆయన బాల నటుడిగా నటించిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇలా కృష్ణ అభిమానులు మహేష్ బాబును హీరోగా చూడాలని అనుకున్నారు.
అభిమానుల అంచనాలను తగిలంట్లే మహేష్ బాబు సినిమాలు కూడా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. మురారి సినిమాతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మహేష్ బాబు తన రూట్ మార్చి మాస్, క్లాస్, యాక్షన్ వంటి చిత్రాల్లో నటించారు. పోకిరి మరియు ఒక్కడు లాంటి సినిమాలు బారి సక్సెస్ అందుకోవడంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
తన కెరీర్ కొత్తలో ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలకు నిర్మాతలు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో మహేష్ బాబు మాట్లాడారు. ఆర్కే మీ నాన్నగారు కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోలేదు. మీరు ఇలాంటివి ఏమైనా చేశారా అని అడిగారు. దీనికి బదులుగా మహేష్ బాబు, నాకు కమర్షియల్ విజయం సాధించిన తర్వాతే పారితోషికం తీసుకున్నానని తెలియజేసారు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.