Home Cinema Rajamouli: ప్రభాస్ కల్కి సినిమాలో రాజమౌళి క్యారెక్టర్ లీక్.. ఆ పాత్రలో జక్కన్న..

Rajamouli: ప్రభాస్ కల్కి సినిమాలో రాజమౌళి క్యారెక్టర్ లీక్.. ఆ పాత్రలో జక్కన్న..

Kalki 2898: బాహుబలి సినిమాతో దేశం వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు ప్రభాస్, ఈ సినిమా తరువాత ప్రభాస్ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. డైరెక్టర్ రాజమౌళికి కూడా ఈ సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది(Rajamouli In Kalki Movie). ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు, దీనితో ఫాన్స్ చాల కోపం మీద ఉన్నారు.

rajamouli

సెప్టెంబర్ 26న విడుదల కావాల్సిన సినిమా డిసెంబర్ కి వాయిదా పడింది. దీనికి కారణాలు ఐతే తెలీదు కానీ ప్రభాస్ ఫాన్స్ కి ఇలా సినిమాలు వాయిదా పడటం కొత్త ఏంకాదు. ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మరో సినిమా కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 9న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాలో ప్రభాస్ విష్ణు మూర్తి చివరి అవతారం కల్కి అవతారం లో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో విల్లన్ గా కమల్ హస్సన్ నటించనున్నారు, కమల్ హస్సన్ ఇలా విల్లన్ పాత్రలో ఒక తెలుగు సినిమాలో నటించటం ఇదే మొదటి సారి. ఇక ఈ సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒక అద్భుతమైన పాత్రలో నటించ బోతున్నారు అట(Rajamouli In Kalki Movie). కల్కి సినిమాలో జక్కన్న ఒక సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు అని తెలుస్తుంది. అంతే కాదు నాగ్ అశ్విన్ రాజమౌళి దెగ్గర దర్శకత్వం పరంగా కొన్ని టిప్స్ కూడా తీసుకోనున్నారు.

ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రీస్తే చేసినట్టు తెలుస్తుంది. అడ్వాన్స్డ్ మోషన్ కాప్చర్ టెక్నాలజీని వాడబోతున్నారు అట ఈ సినిమాలో. రిలీజ్ అయినా టీజర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి అభిమానికి. ఈ సినిమాలో దీపికా పాడుకొనే, అమితాబచ్చన్, దిశా పటాని మరి కొద్దీ స్టార్ కాస్టింగ్ ఉంది ఈ సినిమాలో. అమితాబచ్చన్ పరుష రాముడి క్యారెక్టర్ ఈ సినిమాలో మరో హై లైట్ గా నిలవనుంది అట.

ఇంత అద్భుతమైన కాస్టింగ్ ఉన్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని అభిమానులు అనుకుంటున్నారు. ప్రభాస్, దీపికా, దిశా, రాజమౌళి, కమల్ హస్సన్, అమితాబచ్చన్ వీరందరూ ఇండియన్ సినిమా లో చాల పెద్ద పేరుగల నటులు. అంతే కాకుండా దర్శకత్వం పరంగా రాజమౌళి సలహాలు ఇస్తున్నాడు కాబట్టి సినిమా ప్లాప్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు.

Exit mobile version