Home Cinema NTR: ఎన్టీఆర్ ని దారుంగా అవమానించిన స్టార్ డైరెక్టర్.. అంత మాట అన్నాడేంటి..

NTR: ఎన్టీఆర్ ని దారుంగా అవమానించిన స్టార్ డైరెక్టర్.. అంత మాట అన్నాడేంటి..

NTR: నూనూగు మీసాలు కూడా మొలవని రోజుల్లోనే ఇండస్ట్రీ రికార్డ్స్ ని మడిచి జోబులో పెట్టుకున్న హీరో ఎవరు అని అడిగితే, కళ్ళు మూసుకొని మనమంతా చెప్పే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా, రెండవ సినిమాతో సూపర్ హిట్ కొట్టి. నాల్గవ సినిమా తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసాడు. ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ చిత్రం 2001 వ సంవత్సరం లో విడుదలైంది. నాల్గవ సినిమా ‘ఆది’ 2002 వ సంవత్సరం లో విడుదలైంది(Rajamouli Insults Ntr).

rajamouli-insults-ntr

అలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కేవలం ఒక్క సంవత్సరం గ్యాప్ లోనే ఆయన స్టార్ హీరో అయిపోయాడు. అది కూడా మామూలు రేంజ్ హీరో కాదు, మాస్ ఆడియన్స్ లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కి ఎదిగాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ హీరోకి కూడా ఇలా జరగలేదు. అయితే ఎన్టీఆర్ అప్పట్లో తన లుక్స్ గురించి ఏమాత్రం కూడా పట్టించుకునే వాడు కాదు. భారీ శరీరం తోనే సినిమాల్లో కనిపించేవాడు. ఈయనకి ఇండస్ట్రీ లో అత్యంత సన్నిహితుడైన రాజమౌళి అయితే ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ని వెక్కిరిస్తూనే ఉండేవాడట(Rajamouli Insults Ntr).

అయితే సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ చాలా కాలం వరకు ఒక్క సక్సెస్ కూడా లేకుండా ఇబ్బంది పడేవాడు. అలాంటి సమయం లో కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘రాఖీ’ చిత్రం వచ్చింది. ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎందుకో కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తో ‘యమదొంగ’ చేసాడు ఎన్టీఆర్. ఈ సినిమా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎన్టీఆర్ మితిమీరిన బరువుతో చూసేందుకు చాలా అసహ్యంగా ఉన్నాడట. అప్పుడు రాజమౌళి నువ్వు అసలు ఎంత అసహ్యంగా ఉన్నావో తెలుసా..?

నీ సినిమాలను జనాలు చూడడం ఆపేసారు తెలుసా..? , నువ్వు ఇలాగే ఉంటె తొందర్లో ఫేడ్ అవుట్ అయిపోవడం తథ్యం, నువ్వు సన్నగా అయ్యి వస్తేనే సినిమా చేస్తా అని అన్నాడట. ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద శరీరాన్ని తగ్గించడం ఎలాగో తెలియక , ఎన్టీఆర్ అమెరికా లో ప్రసిద్ధి గాంచిన లైపో సర్జరీ ని చేయించుకున్నాడు. ఆ తర్వాత ‘యమదొంగ’ సినిమాలో సన్నని పుల్లలాగా కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ సరైన ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు. ఆ రోజు రాజమౌళి ఎన్టీఆర్ కి అలాంటి స్ట్రోక్ ఇచ్చి ఉండకపొయ్యుంటే, ఎన్టీఆర్ పేరు ఇప్పుడు స్టార్ హీరోల లిస్ట్ లో ఉండేది కాదేమో.

Exit mobile version