Highest Remuneration : సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాలు ఎన్నో విడుదలై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఇలా పాన్ ఇండియా సినిమా హీరోలా మార్కెట్ పెరిగిపోతుంది. వీరి రెమ్యూనరేషన్ కూడా డబల్ ట్రిపిల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉంది. ఒక్కపుడు కొందరు హీరోలు క్రాస్ ఓవర్ చిత్రాలలో నటించే వారు. ఈ లిస్ట్ లో మొదట ఉంటారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఈయన తమిళ వాడు అయినప్పటికీ తెలుగులో ఈయన సినిమాలు విడుదలై మంచి సక్సెస్ అందుకునేవి.
ఇలా రజినీకాంత్ కు తెలుగు ప్రజలు అభిమానులు అయిపోయారు. రజినీకాంత్ సినిమా వస్తుందంటే తెలుగు ప్రజలు చాల క్యూరియాసిటీతో ఉంటారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఈయన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుండే, వసూలు వర్షం కురిపిస్తుండే. ప్రస్తుతం తలైవర్ గురించి ఓ వార్తా చెక్కర్లు కొడుతుంది. ఈయన తన రాబోయే సినిమా అన్నతేకు బారి పారితోషికం తీసుకుంటున్నాడు అంట.
అన్నతే చిత్రానికి ప్రొడ్యూసర్లు రజినీకాంత్ కు ఏకంగా 280 కోట్లు పారితోషకం ఇస్తున్నారు అంటూ సినిమా ఇండస్ట్రీలో ఓ వార్తా వైరల్ అవుతుంది. ఒకవేళ ఇది నిజం అయితే యావత్ భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోల లిస్టులో మొదటి ప్లేస్ లో మన రజినీకాంత్ ఉంటాడు. మొన్నటికి మొన్న హీరో విజయ్ దళపతి ఒక సినిమాకు గాను 230 కోట్లు పారితోషకంగా తీసుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అదే హైయెస్ట్ అనుకుంటే, ఇపుడు రజినీకాంత్ పారితోషకం ఇంత అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.