Home Cinema Sree Leela : టాలీవుడ్ స్టార్ హీరోలపై శ్రీలీల సెన్సషనల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫాన్స్..

Sree Leela : టాలీవుడ్ స్టార్ హీరోలపై శ్రీలీల సెన్సషనల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫాన్స్..

Sree Leela : శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు దర్శకత్వం వహించిన పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచమైంది. ఈ సినిమాలో శ్రీలీల శ్రీకాంత్ కొడుకు రోషన్ సరసన నటించింది. ఈ సినిమా అంతగా హిట్ అవ్వకపోయిన శ్రీలీల అందానికి తెలుగు ప్రజలు మంత్రముగ్దుళ్లయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఈ భామకు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. శ్రీలీల కంటే ముందు ఎంతో మంది హీరోయిన్లు పరిశ్రమలోకి వచ్చారు కానీ వారెవ్వరికి ఈమె కు దక్కినంత క్రేజ్ దక్కలేదు అనే చెప్పాలి.

ఈ మధ్య కాలంలో వచ్చిన యంగ్ బ్యూటీస్ లో శ్రీలీల ఒక్కదానికే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది. శ్రీలీల అతి తక్కువ సమయంలోనే ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మహేష్ బాబు సరసన నటించి మెప్పించింది. శ్రీలీల కెరీర్ మొదలులో ఆమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా మంచి విజయం సాధించేది. కానీ ఈ మధ్య కాలంలో ఈ భామ నటించిన సినిమాలు అన్ని బోల్తా కొట్టాయి.

sreeleela-about-tollywood-star-heroes

ఇలా శ్రీలీల కు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. తానూ ఏ సినిమా చేస్తే ఆ సినిమా ప్లాప్ అవుతుంది అంటూ జనాలు సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్న శ్రీలీల తెలుగు హీరోలు చేసే హార్డ్ వర్క్ తానూ చేయలేదు అంటూ ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. దీనితో టాలీవుడ్ హీరోల అభిమానులు శ్రీలీల ఛాన్సులకోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అంటున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Exit mobile version