Home Cinema Jailer: చరిత్ర తిరగరాసిన ‘జైలర్’ మొదటి రోజు వసూళ్లు.. సూపర్ స్టార్ మాస్ అంటే ఇదే..

Jailer: చరిత్ర తిరగరాసిన ‘జైలర్’ మొదటి రోజు వసూళ్లు.. సూపర్ స్టార్ మాస్ అంటే ఇదే..

Jailer Day 1 Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్’ నిన్న గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ రావడం తో ఈ చిత్రానికి అన్నీ భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు మరియు తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ తన విశ్వరూపం చూపించాడు. మారుమూల ఉండే డొక్కు థియేటర్స్ ని కూడా హౌస్ ఫుల్ చేసాడు. ఇది కదా సూపర్ స్టార్ అసలు సిసలు స్టామినా అని ప్రతీ ఒక్కరు మాట్లాడుకునేలా చేసాడు.

jailer-day-1-collections

వింటేజ్ రజినీకాంత్ స్టైల్ తో పాటుగా, అనిరుద్ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు పాటలు ఈ చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి(Jailer Day 1 Collections). మరి తెలుగు లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. నిన్న దుమ్ము లేపే ఓపెనింగ్ రావడం తో, తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకి 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

షేర్ ని లెక్క గడితే దాదాపుగా 6 కోట్ల 50 లక్షల రూపాయలకు తేలిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రజినీకాంత్ కి తెలుగు స్టేట్స్ లో రోబో 2 మరియు కబాలి తర్వాత ది బెస్ట్ ఓపెనింగ్ అని అంటున్నారు. మొదటి రోజే 50 శాతం కి పైగా రికవరీ ని సాధించిన ఈ చిత్రం వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని, ఆ తర్వాత కూడా మంచి స్థాయిలో వసూళ్లు వస్తాయని, ఆగష్టు 15 వ తారీఖున నేషనల్ హాలిడే అవ్వడం తో ఆరోజు మొదటి రోజు రేంజ్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తే ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని అంటున్నారు.

అదే కనుక జరిగితే దిల్ రాజు నక్క తోక తొక్కినట్టే అని చెప్పొచ్చు, చూడాలి మరి. ఒక 2 నెలల క్రితం రజినీకాంత్ ఆంధ్రప్రదేశ్ విచ్చేసారు, సీనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్ లో పాల్గొన్న రజినీకాంత్ పై ysrcp నాయకులూ చాల ఘాటుగా విమర్శించారు. అప్పుడు సైలెంట్ గా ఉన్న రజినీకాంత్ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కొంత మంది చిల్లర వైసీపీ నాయకులని కుక్కలతో పిలిచి ఒక రేంజ్ లో ఎక్కిపడేసాడు రజిని. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారటంతో వైసీపీ నాయకుల పరువుపోయి నిద్ర కూడా పట్టం లేదు ంట. రజినీకాంత్ తో పెట్టుకుంటే అలానే ఉంటుంది.

Exit mobile version