Home Cinema చరణ్ బన్నీ మల్టీ స్టారర్ సినిమా టైటిల్ ఫిక్స్.. 10 ఏళ్ళ క్రితమే పేరుని ఫిక్స్...

చరణ్ బన్నీ మల్టీ స్టారర్ సినిమా టైటిల్ ఫిక్స్.. 10 ఏళ్ళ క్రితమే పేరుని ఫిక్స్ చేసిన అల్లు అరవింద్..

ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలకు ఎంత క్రేజ్ వచ్చిందో మనందరం చూసాం. టాలీవుడ్ లోనే కాదు ఇపుడు వేరే ఇండస్ట్రీ లో కూడా మల్టీ స్టారర్ సినిమాలు బాగా పెరిగిపోయాయి. RRR సినిమాకు ఐతే ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ సినిమాకు సంబందించిన వార్త సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతోంది. అల్లు అరవింద్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో లో పాల్గొనటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్ రామ్ చరణ్-అల్లు అర్జున్ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలి అని ఉంది అని అన్నారు.

ram-charan-allu-arjun

వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పటికైనా ఒక సినిమా తీస్తా అని చెప్పారు అల్లు అరవింద్. 10 ఏళ్ళ క్రితమే తాను వీరిద్దరి సినిమా కి ఒక పేరు కూడా ఫిక్స్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు అట. ఆ సినిమా పేరు ‘చరణ్ అర్జున్’ ఈ పేరుని పది ఏళ్ళ క్రితమే అరవింద్ రిజిస్టర్ చేసారు అట, ఇప్పటికి ప్రతి ఏడాది దాన్ని రెన్యువల్ చేస్తూ వస్తున్నారు అట అల్లు అరవింద్. ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే. ఫాన్స్ మాత్రం ఈ సినిమా ఎపుడు స్టార్ట్ చేస్తారా అన్ని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version