Home Cinema Ram Charan : ‘క్లిన్ కారా’ కి దిష్టి తీసినందుకు పనిమనిషికి రామ్ చరణ్ ఇచ్చిన...

Ram Charan : ‘క్లిన్ కారా’ కి దిష్టి తీసినందుకు పనిమనిషికి రామ్ చరణ్ ఇచ్చిన డబ్బులు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు !

Ram Charan : పుడితే గొప్పింటిలోనే పుట్టాలి అని కొంతమంది కోరుకోవడం లో అసలు తప్పు లేదు. కొన్ని సంఘటనలు చూసిన తర్వాత అదంతా నిజమే కదా అనిపిస్తుంది. ఎదుటి వారిని చూసి అసూయ కలుగుతుంది. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా ని చూస్తే ఇదంతా నిజమే అని అనిపిస్తుంది. ఈ చిన్నారి పాపని రామ్ చరణ్(Ram Charan Klin Kaara) మరియు ఉపాసన జంట ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ram-charan-gave-huge-money-to-maid-who-took-dishti-of-klin-kaara

ముఖ్యంగా ఉపాసన అయితే ఆ పాపని ఒక గాజుబొమ్మ లాగా చూసుకుంటుంది. ఇప్పటి వరకు అభిమానులకు మరియు మీడియా కి పాప ముఖాన్ని చూపించలేదు. అచ్చం రామ్ చరణ్ పోలికలతో పుట్టిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. పాపకి ఏడాది నిండే వరకు మీడియా కి చూపించకూడదు అని అనుకున్నారట ఈ జంట. ఇకపోతే క్లిన్ కారా విషయం లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే పుట్టిన ప్రతీ బిడ్డకి దిష్టి తియ్యడం అనేది సహజం.

సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళే ఇలాంటి ఆచారాలను తూచా తప్పకుండా ఫాలో అవుతుంటారు. ఇక కోట్లాది మంది అభిమానులు ఉన్న రామ్ చరణ్ లాంటి స్టార్ కూతురు గురించి ఎన్ని లక్షల మంది దిష్టి పెట్టి ఉంటారో. నరదిష్టి పసి బిడ్డలకు అసలు ఏమాత్రం మంచిది కాదు. అందుకే రీసెంట్ గానే ఈ పాపకి దిష్టి తీయించారట. దిష్టి తీసిన వాళ్లకు రెండు రూపాయిలుకాని , లేదా వాళ్లకి తోచినంత డబ్బులు కానీ ఇవ్వడం చేస్తుంటారు.

కానీ రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారా(Ram Charan Klin Kaara) కి దిష్టి తీసినందుకు గాను 10 లక్షల రూపాయిలు ఇచ్చాడట ఒక ఆమెకి. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. పెద్దింట్లో పుడితే మహారాణి లాగ ఇలా బ్రతకొచ్చా అని అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఇక రామ్ చరణ్ చేస్తున్న చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన శంకర్ తో ‘గేమ్ చేంజర్‘ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version