Home Cinema Naresh – Pavitra : పరీక్షల్లో ఫెయిల్ అయిన పవిత్రా లోకేష్.. ఈ వయస్సులో అవసరమా...

Naresh – Pavitra : పరీక్షల్లో ఫెయిల్ అయిన పవిత్రా లోకేష్.. ఈ వయస్సులో అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్!

Naresh – Pavitra : సోషల్ మీడియా లో గత కొంతకాలం గా ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న జంట నరేష్ – పవిత్ర లోకేష్. ఇద్దరికీ అంతకుముందే పెళ్లి అయ్యినప్పటికీ, మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకోవడం పెను దుమారమే రేపింది. మనవడిని ఎత్తుకొని ఆడించాల్సిన వయస్సులో పెళ్లి(Naresh Pavitra Lokesh) చేసుకొని సభ్య సమాజానికి ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారు అంటూ నరేష్ పవిత్ర లోకేష్ పై నెటిజెన్స్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

here-are-the-latest-news-about-naresh-and-pavitra-lokesh

కొంతమంది అయితే వీళ్ళండి సినిమాల్లో చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, నరేష్ కెరీర్ పై ఈ పెళ్లి ప్రభావం పెద్దగా లేకపోయియుండొచ్చు కానీ, పవిత్ర లోకేష్ మీద మాత్రం చాలా తీవ్ర స్థాయిలో పడింది. ఆమెకి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇకపోతే రీసెంట్ గా పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటో ఒకసారి చూసి తెలుసుకుందాం.

అసలు విషయం లోకి వెళ్తే పవిత్ర లోకేష్ కి తన మాతృ బాషా కన్నడ లో PCD చెయ్యాలని ఎప్పటి నుండో కోరిక ఉండేది. ఇటీవలే ఆమె బళ్లారి హంపీ యూనివర్సిటీ లో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసింది. నరేష్ ఆమెని స్వయంగా అక్కడికి తీసుకెళ్లి పరీక్షా రాయించాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రీసెంట్ గానే ఈ పరీక్షకి సంబంధించిన ఫలితాలు బయటకి వచ్చాయి. 981 మంది ఈ పరీక్ష ని రాయగా, అందులో కేవలం 259 మంది మాత్రమే పాస్ అయ్యారు.

వీరిలో మన పవిత్ర లోకేష్ కూడా ఒకరు. అయితే మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది కానీ, ఆమెకి యూనివర్సిటీ లో చదివేందుకు సీట్ మాత్రం రాలేదు. ఎందుకంటే ఈమె కంటే బెటర్ ర్యాంకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే తక్కువ రావడం వల్ల ఉతీర్ణత సాధించినప్పటికీ యూనివర్సిటీ లో సీట్ దక్కలేదు.

దీంతో ఆమె తీవ్రమైన నిరాశకి గురైంది. ఇక సోషల్ మీడియా లో ఈ విషయాన్నీ తెలుసుకున్న నెటిజెన్స్ పవిత్ర ని మీ ఆయన నరేష్(Naresh Pavitra Lokesh) తో తిరగడం మీద పెట్టే శ్రద్ద, చదువు మీద పెట్టి ఉంటే ఆ యూనివర్సిటీ లో సీట్ దొరికేది కదా అని సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version