Home Cinema Ram Charan: ఆ స్టార్ హీరో కూతురుతో రామ్ చరణ్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం...

Ram Charan: ఆ స్టార్ హీరో కూతురుతో రామ్ చరణ్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా..

Ram Charan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. మెగాస్టార్ తనయుడిగా కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, తొలిసినిమా చిరుత తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘మగధీర’ సినిమాతో తండ్రినే మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు #RRR చిత్రం తో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అని కాకుండా, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి వెళ్ళాడు(ram charan venkatesh daughter). ఏ తండ్రికైనా ఇంతకు మించి కావాల్సింది మరొకటి ఏముంది.

Ram-Charan-venkatesh-daughter

కేవలం వృత్తి పరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా రామ్ చరణ్ కి ఎంతో గొప్ప పేరుంది. మెగా ఫ్యామిలీ కుటుంబం లో ఒక్క మచ్చ కూడా లేని వ్యక్తిగా రామ్ చరణ్ నిలిచాడు. అందుకే ఆయనని అభిమానులు అంతలా ఆరాధిస్తారు. ఇక రామ్ చరణ్ ఉపాసన ని పెళ్లి చేసుకొని 11 ఏళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఈమధ్యనే ఒక పాప కి జన్మని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్య దాంపత్యం తో వీళ్లిద్దరు లక్షలాది మంది ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ ఉపాసనకు ముందు ఒక ప్రముఖ స్టార్ హీరో కూతురుని పెళ్లి చేసుకోవాల్సింది అట.

ఆ స్టార్ హీరో మరెవరో కాదు, విక్టరీ వెంకటేష్(ram charan venkatesh daughter). చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితులలో ఒకడు వెంకటేష్. వెంకటేష్ అంటే చిరంజీవి కుటుంబం లో అందరికీ ఎంతో ఇష్టం. అయితే వెంకటేష్ కి మొదటి నుండి తన పెద్ద కూతురు ఆశ్రిత ని రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఉండేదట. ఇదే విషయాన్నీ చిరంజీవి కి చెప్పగా, చిరంజీవి కూడా ఎంతో సంతోషించాడని, కానీ రామ్ చరణ్ వద్దకి ఈ విషయం తీసుకెళ్లిన తర్వాత రామ్ చరణ్ ఉపాసన తో ప్రేమలో ఉన్న విషయాన్నీ చెప్పుకొచ్చాడని, దాంతో వెంకటేష్ కూడా వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్పి తప్పుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో బలంగా వినిపిస్తున్న వార్త.

ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు రామ్ చరణ్ – ఉపాసన పెళ్లి ఘనంగా జరగడం, ఆ పెళ్ళికి విక్టరీ వెంకటేష్ తన కుటుంబం తో హాజరై వధూవరులను ఆశీర్వదించడం అన్నీ అలా జరిగిపోయాయి. ప్రస్తుతం ఐతే రామ్ చరణ్ సినిమాలను వదిలేసి తండ్రిగా మొన్ననే పుట్టిన కూతురు (క్లిన్ కార కొణిదెల) తో ఆడుకుంటూ సమయం గడిపేస్తున్నాడు. ఫాన్స్ మాత్రం రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కోసం చాల ఎదురు చూస్తున్నారు అనే చెప్పుకోవాలి. మరి వేచి చూడాలి రామ్ చరణ్ ఎపుడు మల్లి పనికి తిరిగి వచ్చిన సినిమాలు మొదలు పెడతాడు అని.

Exit mobile version