Home Cinema NTR: దేవర సినిమాలో ఎన్టీఆర్ కి అత్తగా ఆనాటి హాట్ హీరోయిన్.. ఎవరేంటి..

NTR: దేవర సినిమాలో ఎన్టీఆర్ కి అత్తగా ఆనాటి హాట్ హీరోయిన్.. ఎవరేంటి..

Ramya Krishna In Devara: RRR చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న ‘దేవర’ చిత్రం షూటింగ్ ఎంత వేగంగా జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు 5 షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆరవ షెడ్యూల్ ని జరుపుకుంటూ ఉంది. ఈ ఆరవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటుగా సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొనబోతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ ని తెరకెక్కించారు, ఇప్పుడు మరో భారీ ఫైట్ సీన్ ని తియ్యబోతున్నారు.

ramya-krishna-in-devara-with-ntr

ఇలా సినిమాలో చాలా సన్నివేశాలను ఫైట్స్ తోనే నింపేయబోతున్నారా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సౌత్ లో ఆమెకి ఇదే మొదటి సినిమా, ఆమె ఈ సినిమాలో అడుగుపెట్టినప్పటి నుండి బజ్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లోకి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా అడుగుపెట్టబోతున్నారు(Ramya Krishna In Devara).

ఈ చిత్రం లో ఆమె ఎన్టీఆర్ కి అత్తయ్య గా నటిస్తుందట. గతం లో ఈమె ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహాద్రి’ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఆ తర్వాత ‘నా అల్లుడు’ చిత్రం లో ఎన్టీఆర్ కి అత్తగా నటించింది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎన్టీఆర్ తో కలిసి ముచ్చటగా మూడవసారి నటిస్తుంది. ఇందులో ఆమె చాలా పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తుంది. రమ్య కృష్ణ ఒక సినిమా ఒప్పుకుంది అంటే కచ్చితంగా కథాబలం ఉంటేనే ఒప్పుకుంటుంది అనే బ్రాండ్ ఇమేజి ఆమెకి ఎప్పటి నుండో ఉంది. అందుకే ఆమె పాత్ర ప్రతీ సినిమాలో బాగా పండుతుంది, పవర్ ఫుల్ గా కూడా అనిపిస్తాది.

డిసెంబర్ లోపు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కాబోతున్నాయని, ఆ తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ చిత్రం చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు అయ్యాక ఆయన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరోకు తరువాత సినిమా అట్టర్ ప్లాప్ అవ్వటం ఖాయం. ఈ సెంటిమెంట్ ప్రతి హీరోకు, ప్రేక్షకుడికి కూడా ఉంది. ఎన్టీఆర్ మరి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా లేదా అని ఫాన్స్ అనుకుంటున్నారు.

Exit mobile version