Home Cinema Rashmika : అత్యాశకి పొయ్యి 10 కోట్లు పోగొట్టుకున్న రష్మిక.. పాపం ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి..

Rashmika : అత్యాశకి పొయ్యి 10 కోట్లు పోగొట్టుకున్న రష్మిక.. పాపం ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి..

Rashmika : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో రష్మిక మందన కచ్చితంగా ఉంటుంది. కన్నడ లో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక, తెలుగులో చలో సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన రష్మిక ఆ తర్వాత అతి తక్కువ విజయ్ దేవరకొండ తో చేసిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో మంచి క్రేజ్ ని దక్కించుకున్న రష్మిక కి టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది(Rashmnika Mandanna Loss).

actress-rashmika

అలా చూస్తూ ఉండగానే టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. వచ్చిన అవకాశాలను కూడా చిన్న చిన్న పొరపాట్లు కారణంగా చేజారిపోయేలా చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా ఈమె ప్రముఖ యంగ్ హీరో నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. గతంలో ఇదే కాంబినేషన్ లో భీష్మ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా నుండి రష్మిక తప్పుకుంది. అందుకు కారణం ఆమెకి బాలీవుడ్ లో అవకాశం రావడం వల్లే.

ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ తో కలిసి నటించడానికి రష్మిక ఒక సినిమా ఒప్పుకుంది. రష్మికకి రెండు సినిమాలకి డేట్స్ క్లాష్ రావడం తో ఆమె నితిన్ సినిమా వదిలేసుకుంది. నితిన్ సినిమా వదులుకోవడం వల్ల ఆమెకి అక్షరాలా 5 కోట్లు రెమ్యూనరేషన్ నష్టం వాటిల్లింది. ఇప్పుడు షాహిద్ కపూర్ తో చేయబోయే సినిమా కూడా బడ్జెట్ కారణంగా ఆగిపోయింది అనే వార్త వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే రష్మిక సాలిడ్ గా 10 కోట్ల రూపాయిలు నష్టపోయినట్టే అని అంటున్నారు(Rashmnika Mandanna Loss). దానికి తోడు రష్మిక కి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు కూడా లేవు, దీనితో రష్మిక కెరీర్ ఇప్పుడు డైలామా లో పడింది.

కొత్తగా శ్రీలీల రాకతో ఈమెని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దాంతో నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రష్మిక ఇప్పుడు ఒక్కసారిగా అవకాశాలు లేని హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో పుష్ప ది రూల్ మాత్రమే ఉంది. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ మళ్ళీ మారుతుందో లేదో చూడాలి. రష్మిక ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

పుష్ప 1 తో అదిరిపోయే హిట్ అందుకున్న రష్మిక, ఆ తరువాత డీలా పడిపోయింది అనే చెప్పాలి. హిట్లు లేక ఫాన్స్ కూడా నిరాశచెందుతున్నారు. ఈ అమ్ముడు చేతిలో ప్రస్తుతం బానే సినిమా ఉన్నాయి.

Exit mobile version