Home Cinema Richa Gangopadhyay : నమ్మించి మోసం చేసిన ఆ స్టార్ హీరో వల్లనే రిచా గంగోపాధ్యాయ...

Richa Gangopadhyay : నమ్మించి మోసం చేసిన ఆ స్టార్ హీరో వల్లనే రిచా గంగోపాధ్యాయ సినిమాలకు గుడ్ బై చెప్పిందా..?

Richa Gangopadhyay : తెలుగు ప్రేక్షకులు ఒక హీరో ని కానీ హీరోయిన్ ని కానీ అంత తేలికగా ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడ్డారంటే మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళ అభిమానం ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు, అలాంటిది కొంత మంది హీరో/ హీరోయిన్లు కేవలం ఒకటి రెండు సినిమాల్లోనే అశేష ప్రేక్షకాభిమానం పొందుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రిచా గంగోపాధ్యాయ. ఈమె హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లీడర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.

richa-gangopadhyay-quit-movies-because-of-this-star-hero

ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఈమెకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఆమె చేసిన సినిమాల్లో ‘మిర్చి’,మిరపకాయ్ వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మిర్చి సినిమాలో ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ పాత్రే అయ్యినప్పటికీ ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్రనే పోషించింది. ఈ చిత్రం తర్వాత రవితేజ తో ‘సారొచ్చారు’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది, ఆ తర్వాత నాగార్జున తో ‘భాయ్’ అనే చిత్రం లో నటించింది, ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇదే ఆమె ఆఖరి సినిమా కూడా, ఆ తర్వాత అమెరికా లో ఏం ఎస్ చదువుకోవాలి అంటూ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. అమెరికా లో 2017 వ సంవత్సరం లో డిగ్రీ పట్టా పొందిన రిచా, అక్కడే ఉన్నటువంటి తన చిన్న నాటి స్నేహితుడు జో లాంగేళ్ల ని ప్రేమించి పెళ్లాడింది. ఈ ఇద్దరు దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. వీళ్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటుంది రిచా గంగోపాధ్యాయ.

ఇదంతా పక్కన పెడితే కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లో ఏ అమ్మాయి కూడా వదులుకోవాలని చూడడు. అలాంటిది రిచా అలా చేసిందంటే కచ్చితంగా ఎదో బలమైన కారణం వేరేది ఎదో ఉందని ఆమె అభిమానుల్లో ఉంది. అయితే అప్పట్లో ఈమె ఒక హీరో తో చాలా ఘాడంగా ప్రేమాయణం నడిపింది అని, అతనితో జరగాల్సినవన్నీ కూడా జరిగిపోయాయని.

పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన అతను చివరికి హ్యాండ్ ఇచ్చాడని, దాంతో ఇక సినిమా ఇండస్ట్రీ అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా, దీనికి దూరంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే ఆమె నటనకి గుడ్ బాయ్ చెప్పిందని ఆమెకి(Richa Gangopadhyay) సన్నిహితంగా ఉన్నవాళ్లు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు .

Exit mobile version