Home Cinema Nithin: భార్యతో మంచి మూడ్ లో హీరో నితిన్.. తండ్రి కాబోతున్నాడా..

Nithin: భార్యతో మంచి మూడ్ లో హీరో నితిన్.. తండ్రి కాబోతున్నాడా..

Nithin With Wife: యంగ్ హీరోలలో మంచి మార్కెట్ ఉన్నవారిలో ఒకడు నితిన్. ‘జయం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నితిన్ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో ఆయనకీ వరుసగా 12 డిజాస్టర్ ఫ్లాప్స్ పడ్డాయి. ఆయన మార్కెట్ జీరో అయిపోయింది. కొన్ని సినిమాలు విడుదలకు నోచుకోక ఇప్పటికీ ప్రసాద్ ల్యాబ్స్ లోనే ఉన్నాయి. అలాంటి స్థితి నుండి ‘ఇష్క్’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకొని , భారీ కం బ్యాక్ ఇచ్చి తనకంటూ ఒక మళ్ళీ ప్రత్యేకమైన మార్కెట్ ని ఎప్రాటు చేసుకున్నాడు.

Nithin-With-Wife

ఇప్పుడు నితిన్ సినిమాకి సగటున 30 నుండి 40 కోట్ల రూపాయిల మధ్యలో బిజినెస్ జరుగుతుంది. జీరో మార్కెట్ నుండి ఈ స్థాయికి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే నితిన్ ఈమధ్యనే షాలిని అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నితిన్ తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి, తన భార్య తో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనా వెళ్ళాడు(Nithin With Wife). అక్కడ తన రొమాంటిక్ ట్రిప్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవానికి వీళ్లిద్దరి ప్రేమ ఈ ప్రాంతంలోనే ప్రారంభం అయ్యింది. సుమారు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2020 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు.

ఇక షాలిని తల్లితండ్రులు డాక్టర్లు, వీళ్ళకి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తో సంబంధాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరి పెళ్లి జరిగి మూడేళ్లు అయినా సందర్భంగా షాలిని సోషల్ మీడియా లో భర్త తో కలిసి ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ , మూడేళ్లు ఎంతో అందంగా గడిచిపోయాయి అంటూ పోస్ట్ చేసింది. నితిన్ ని ముద్దు పెట్టుకుంటూ ఆమె పెట్టిన ఈ రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. షాలిని చాలా కాలం నుండి ఇంస్టాగ్రామ్ లో ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ కూడా అవుతుంది. ఇక రీసెంట్ గా పెట్టిన ఫోటోలకు అభిమానులు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేసారు. హీరో నితిన్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మం’ మరొకటి ఏమో ‘వీఎన్ఆర్’ ఈ రెండు సినిమాలు డిసెంబర్ లోనే రిలీజ్ కి సిద్ధం అవ్వటం విశేషం. ఒకటి ఏమో డిసెంబర్ 23 న మరొకటి 13 డిసెంబర్. హీరో నితిన్ ఫాన్స్ కి పండగే అని చెప్పుకోలవి. ఈ రెండు సినిమాలు హిట్టు కొడతాయి అని భావిస్తున్నాను.

Exit mobile version