Home Cinema Sai Pallavi : తల్లి ముందు సాయి పల్లవి ఇలాంటి పనులు చేసిందా.. సాహసం అనే...

Sai Pallavi : తల్లి ముందు సాయి పల్లవి ఇలాంటి పనులు చేసిందా.. సాహసం అనే చెప్పాలి..

Sai Pallavi Habits : టాలీవుడ్ లో టాలెంట్ తో సినిమా అవకాశాలను దక్కించుకునే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన హీరోయిన్స్ లాగ కాకుండా, కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి, ఈమెకి ఉన్న క్రేజ్ ని చూసి అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. అంటే హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో, హీరోయిన్స్ లో సాయి పల్లవి కి అంత క్రేజ్ ఉంది అన్నమాట. అయితే క్రేజ్ ఉంది కదా అని ఏ రోల్ పడితే ఆ రోల్ చెయ్యడానికి ఇష్టపడడు.

sai-pallavi

ఆమె ఒక సినిమా ఒప్పుకుంది అంటే ఆడియన్స్ కి కచ్చితంగా అర్థం అయ్యిపోతాది, ఈ సినిమాలో ఎదో విషయం ఉందని. అందాల ఆరబోతకు కానీ, లిప్ లాక్ సన్నివేశాలకు కానీ సాయి పల్లవి ఒప్పుకోదు(Sai Pallavi Habits). ఒకవేళ అలాంటి సినిమాలు చేసినా కూడా కథకి అత్యంత కీలకం అయితే తప్ప చెయ్యదు. కొన్ని కొన్ని సార్లు ఆమెకి స్టార్ హీరోల సినిమాల్లో నటనకి ప్రాధాన్యం లేని పాత్రలు చేసే అవకాశం దక్కింది. కానీ మొహమాటం లేకుండా ఆ సినిమాల్లో నేను నటించలేను అని చెప్పి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకుంది. ఇంత ఉన్నతమైన విలువలు ఫాలో అవుతూ హీరోయిన్ గా కొనసాగుతున్న సాయి పల్లవి, కన్నతల్లి ముందు ఒక చెయ్యకూడని పని చేసిందట.

ఈమె సినిమాల్లోకి అడుగుపెట్టముందు MBBS చదివిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి రాకపోతే డాక్టర్ ని అయ్యేదానిని అంటూ ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది కూడా. అయితే ఒకసారి ఈమె కన్న తల్లి ముందు సిగరెట్ తాగాల్సిన అవసరం వచ్చిందట, ఇది సినిమా షూటింగ్ కోసం కాదు, సిగరెట్ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో చెప్పడానికి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేసిందట, ఈ ప్రోగ్రాం కి ఆమె తల్లి కూడా వచ్చింది. సిగరెట్ తాగడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందో చెప్పడానికి, ఆమె కూడా ఒక సిగరెట్ కాల్చి, ఉదాహరణలు చూపించిందంట.

అయితే ఆమె కాల్చింది నిజం సిగరెట్ కాదు, అది డమ్మీ సిగరెట్ అట. అలా ఆమెకి షూటింగ్ లేని సమయాల్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసి జనాల్లో చైతన్యం కలిగిస్తుందట. సాయి పల్లవి ప్రస్తుతం అల్లు అర్జున్ రష్మీకళతో కలిసి పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర చాల ప్రాత్యేకంగా ఉండబోతుంది అట. ఈ పాత్రలో సాయి పల్లవిని ఇప్పటివరకు ఎవరు చూడని విధంగా చూపించబోతున్నాడు అంట డైరెక్టర్ సుకుమార్. ఫాన్స్ మాత్రం ఈ సినిమా విడుదల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి.

Exit mobile version