Home Cinema Samantha : సమంత ప్రేమలో పడింది.. త్వరలోనే పెళ్లి అంటూ పోస్ట్ వైరల్..

Samantha : సమంత ప్రేమలో పడింది.. త్వరలోనే పెళ్లి అంటూ పోస్ట్ వైరల్..

Samantha Love : విజయ్ దేవర కొండ మరియు సమంత కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఇప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన ‘ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్’ లో సమంత మరియు విజయ్ దేవరకొండ ఇచ్చిన లైవ్ రొమాంటిక్ పెర్ఫార్మన్స్ హాట్ టాపిక్ గా నిల్చింది. విజయ్ దేవరకొండ ఆరోజు తాను వేసుకున్న షర్ట్ ని విప్పేసి సమంత తో కలిసి రొమాంటిక్ ఫీట్ చెయ్యడం.

samantha-posts-that-she-need-more-love-from-vijay-devarakonda

దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం ద్వారా ‘ఖుషి’ మూవీ గురించి జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ గా ఈ వీడియో నెగటివిటీ వే లోనే వెళ్తుంది. ఇది మ్యూజిక్ కన్సర్ట్ లాగ లేదు, ఇన్నర్ వేర్ యాడ్ లాగా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే సమంత ఆరోజు జరిగిన లైవ్ పెర్ఫార్మన్స్ తాలూకు ఫోటోని ఒకటి షేర్ చేస్తూ, ‘ఎంత ప్రేమించుకున్న సరిపోవడం లేదు’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది(Samantha Love). దీనిని చూసి అభిమానులు అసలు మీరు సినిమాలోనే ప్రేమించుకున్నారా ?

లేదా నిజ జీవితం లో కూడా లవ్ చేసుకున్నారా? మీ ఇద్దరి వాలకం చూస్తూ ఉంటే నిజంగానే ప్రేమలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే చూసేందుకు జంట చాలా బాగుంది, పెళ్లి చేసుకుంటే బాగుండును అని అంటున్నారు. మరికొంతమంది అయితే నాగ చైతన్య కుళ్ళుకోవడానికి సమంత కావాలని ఇలాంటి పనులు చేస్తుందని అంటున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం అనేది పక్కన పెడితే సోషల్ మీడియా లో సమంత మరియు విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రేమ జంటగా బాగా పాపులర్ అయ్యారు.

మరి ఇది సినిమా సక్సెస్ అయ్యేందుకు ఉపయోగపడుతుందా, లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 1 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇద్దరి కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు, డైరెక్టర్ శివ నిర్వాణ ఎంచుకున్న పాయింట్ మీద ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదని, కాబట్టి ఈ సబ్జెక్టు పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నారు, చూడాలి మరి. సమంత కి విజయ్ దేవరకొండకి అసలుకే హిట్లు లేక ఫాన్స్ చాలా నిరాశతో ఉన్నారు. కనీసం ఈ సినిమాతో అయినా వీలు వీరి ప్లాప్ బ్రేక్ చేస్తారు అని భావిస్తునం.

Exit mobile version