Home Cinema Naga Chaitanya : నువ్వు చేస్తే రైట్ మా సామ్ చేస్తే తప్పా. చైతు ని...

Naga Chaitanya : నువ్వు చేస్తే రైట్ మా సామ్ చేస్తే తప్పా. చైతు ని ఒక ఆట ఆడుకున్న సామ్ ఫాన్స్..

Naga Chaitanya : నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎంత బోల్డ్ గా తయారు అయ్యిందో మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య కుళ్ళుకోవాలని ఆమె ఉద్దేశపూర్వకంగా అలా చేస్తుందో ఏమో తెలియదు కానీ, ఆమె చేస్తున్న బోల్డ్ తరహా పాత్రలపై నెటిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రీసెంట్ గా ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ(Samantha Naga Chaitanya). ఎందుకంటే సమంత ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి ఆ రేంజ్ రొమాన్స్ చేసింది.

samantha-vijay-devarakonda

ముఖ్యంగా ‘ఆరాధ్య’ అనే సాంగ్ ఆమె ఏకంగా లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించింది. రీసెంట్ గా ‘బాయ్స్ హాస్టల్’ అనే సినిమాకి వచ్చిన సమంత మాజీ భర్త నాగ చైతన్య, ఇంటర్వెల్ లో ఈ ఖుషి రొమాంటిక్ ట్రైలర్ ని చూడలేక థియేటర్ నుండి బయటకి వెళ్లిపోయాడని ఇండస్ట్రీ లో ఒక టాక్ నడిచిన సంగతి మన అందరికీ తెలిసిందే(Samantha Naga Chaitanya). ఇప్పుడు సోషల్ మీడియా లో సమంత లిప్ లాక్ సన్నివేశాలపై తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. పెళ్ళై విడాకులు తీసుకున్న అమ్మాయి, ఈ స్థాయిలో రెచ్చిపోయి రొమాన్స్ చెయ్యడం అనేది ఇప్పటి వరకు మేము ఎక్కడా చూడలేదు అంటూ నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.

విడాకులు తీసుకుంది కదా అని ప్రతీ విషయం లో స్వతంత్రం సాధించాను అని అనుకోవడం లో తప్పు లేదు కానీ, మరీ ఇలా హద్దులు దాటి ప్రవర్తించడం సరికాదు అంటూ నాగ చైతన్య ఫ్యాన్స్ సమంత పై విరుచుకుపడుతున్నారు. దీనికి సమంత ఫ్యాన్స్ కూడా చాలా బలమైన కౌంటర్ వేశారు. నాగ చైతన్య రీసెంట్ మూవీ ‘థాంక్యూ’ చిత్రం లో హీరోయిన్ రాశి ఖన్నా తో కలిసి లిప్ లాక్ సన్నివేశం లో నటించిన ఫోటో ని పోస్ట్ చేసి, మీ హీరో ఇలా లిప్ లాక్ సన్నివేశం లో నటించినప్పుడు తప్పు లేదు కానీ, మా సమంత నటిస్తే పాపం అయిపోయిందా..? ఇదెక్కడి న్యాయం, మగవాళ్ళకి ఒక రూల్, ఆడవాళ్ళకు ఒక రూలా ? అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్.

నాగ చైతన్య ప్రస్తుతం ఎటువంటి సినిమాలు చేయటం లేదు, దీనికి కారణం ఎటువంటి సినిమా ఆఫర్ లు రాకపోవటమే. అక్కినేని ఫాన్స్ కి అసలు ఈ ఏడాది ఒక్క మంచి సినిమా కూడా రాలేదు. ఫాన్స్ మాత్రం మాములు నిరాశతో లేరు. సినిమా ఎపుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. నాగ చైతన్య మొన్న సముద్రపు జాలరులందరిని కలిసి వారి కష్టాలు దిన చర్య గురించి తెలుసుకున్నాడు. ఆ టాపిక్ మీద ఏదో సినిమా చేస్తునట్టు ఉన్నాడు.

సమంత మాత్రం చాల సినిమాలు ప్లాప్ తరువాత వచ్చిన ఒక చిన్న సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఖుషి ఏమి అంత తోపు లేదు కానీ సినిమా, ఏదో ఒక మాదిరిగా ఉంది. సమంత ఫాన్స్ కి మాత్రం తన పాత సినిమాలకంటే ఇది కోడిగా బెటర్ అని అనిపించింది అంట.

Exit mobile version