Home Cinema Samantha : సమంత ధరించిన ఈ దుస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Samantha : సమంత ధరించిన ఈ దుస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Samantha : సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేరు సమంత. సౌత్ లో బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరైన ఈమెకి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న కమర్షియల్ యాడ్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది(Samantha Dress Cost). తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సమంత క్రేజ్ యూత్ లో విపరీతంగా పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

actress-samantha

వరుసగా సౌత్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు, అవి అనుకున్న దానికంటే భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం, చూస్తూ ఉండగానే సమంత సౌత్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా మారిపోవడం వంటివి జరిగిపోయాయి. అందం తో పాటుగా నటనకి కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ క్రేజీ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. సమంత సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉండే విషయం మన అందరికీ తెలిసిందే. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్స్ ని అప్లోడ్ చేస్తూ కుర్రకారులను పిచ్చెక్కిపోయేలా చేస్తుంది.

ముఖ్యంగా రకరకాలు డిజైన్ అవుట్ ఫైట్స్ తో ఆమె వేసుకునే దుస్తులు అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలలో ధరించిన ‘ఫ్రంట్ స్లిట్ ఫుల్ స్లీవ్ జాకెట్’ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ డ్రెస్ లో సమంత మెరిసిపోతుంది, చూసేందుకు దుస్తులు చాలా ఆకర్షణీయంగా ఉంది, మనం కూడా కొనుగోలు చేద్దాం అని కొంతమంది అభిమానులు గూగులే లో వెతకగా ఈ డ్రెస్ ధర దొరికింది(Samantha Dress Cost). సుమారుగా 2 లక్షల 55 వేల రూపాయిలు విలువ చేసే డ్రెస్ అన్నీ ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో అందుబాటులోనే ఉంది.

ఇకపోతే సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి‘ సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో నిన్న మొన్నటి వరకు పాల్గొన్న సమంత ఇప్పుడు న్యూయార్క్ లో మయోసిటిస్ చివరి చికిత్స కోసం వెళ్ళింది. విజయ్ దేవరకొండ చివరి సినిమా అయినా లైగర్ అట్టర్ ప్లాప్ అవ్వటంతో తన ఆశలు అన్ని ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు..

సమంత కూడా తన చివరి సినిమా ప్లాప్ అవ్వటంతో కనీసం ఈ సినిమా అయినా హిట్ అవ్వాలి అని కోరుకుంటుంది. ఈ సినిమా కానీ హిట్ ఐతే ఇంక సమంత విజయ్ దేవరకొండల దిశా తిరిగినట్టే. భిమానులతో పాటు మేము కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. మరి ఎం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version