Home Cinema Samantha: ఒకే రూమ్ లో ఎన్నో రాత్రులు గడిపిన సమంత విజయ దేవరకొండ.. విషయం ఇంత...

Samantha: ఒకే రూమ్ లో ఎన్నో రాత్రులు గడిపిన సమంత విజయ దేవరకొండ.. విషయం ఇంత దూరం వచ్చిందా..

Samantha Vijay Same Room: సోషల్ మీడియా లో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్స్ లో ఒకరు సమంత. ‘ఏం మాయ చేసావే’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగింది. అలా కెరీర్ లో దూసుకెళ్తున్న సమయం లోనే అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరు 2017 వ సంవత్సరం లో పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకొని, ఆ తర్వాత నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. విడాకులు తీసుకున్న రోజు నుండి నేటి వరకు వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ఎన్నో వార్తలు వచ్చాయి.

vijay-devarakonda-samantha-same-room

ముఖ్యంగా సమంత మీద వచ్చినన్ని పుకార్లు ఇండస్ట్రీ లో ఏ స్టార్ హీరోయిన్ మీద కూడా రాలేదని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ లో పెట్టింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లో సమంత విజయ దేవరకొండ కి బాగా దగ్గరైంది అట.

వీళ్లిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఒకే గదిలో ఎన్నో రోజులు గడిపినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త(Samantha Vijay Same Room). ఈ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య రిలేషన్ కూడా ఏర్పడింది అని అంటున్నారు. మరోపక్క ఈ రూమర్స్ పై సమంత అభిమానులు చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెపై రోజుకి ఎన్ని పుకార్లు పుట్టించి క్రిందకి తోయాలని చూస్తారో చూడండి. మీరు ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది ఆమె అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఈ సినిమా తో పాటుగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

చాలా కాలం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా ఖుషి . ఇన్ని రోజులు ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, మరియు విలన్ రోల్స్ చేస్తూ వచ్చింది. రెగ్యులర్ హీరోయిన్ గా చాలా కాలం తర్వాత వెండితెర పై మరోసారి కనిపించబోతుంది. మరి ఈ చిత్రం ఆమెకి మంచి కం బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. సమంత ఫాన్స్ ఒక పక్క సక్సెస్ కోసం, అక్కినేని ఫాన్స్ మరో పక్క మంచి సినిమా కోసం ఎదురుచూపులు తప్పవా..?

Exit mobile version