Home Cinema సీనియర్ నటుడు రఘుబాబు కార్ ఆక్సిడెంట్.. స్పాట్ లో చనిపోయిన అవతల వ్యక్తి..

సీనియర్ నటుడు రఘుబాబు కార్ ఆక్సిడెంట్.. స్పాట్ లో చనిపోయిన అవతల వ్యక్తి..

senior-actor-raghu-babu-car-accident-hit-biker-coming-in-wrong-way

సీనియర్ నటుడు రఘు బాబు గురించి అందరికి తెలిసిందే. ఆయన నటనతో కామెడీ తో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు ప్రస్తుతం ఈయనకు సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సీనియర్ నటుడు రఘు బాబు కారును ఓ వ్యక్తి రాంగ్ రూట్ లో బండిపై వచ్చి ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే. రఘు బాబు హైదరాబాద్ నుండి ఏదో పని చూసుకోవటానికి మిర్యాలగూడ వెళ్తున్నాడు.

అలా వెళ్తున్న సమయంలో నార్కెట్ పల్లి హైవే మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అవతల వ్యక్తి రిక్క్ష ఫుల్లెర్ కాలనీ లో తన దత్త సాయి వెంచర్ లో పని చూసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఇక ఆ క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్తున్న అతడి బండిని రఘు బాబు కార్ ఢీకొట్టింది. ఆ వ్యక్తి ఆన్ స్పాట్ చనిపోయాడు, చనిపోయిన వ్యక్తిని సాదినేని జనార్దన్ రావు గా పోలీసులు గుర్తించారు. ఇతడు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రఘు బాబు కార్ ఇతడి బండిని ఢీకొట్టి దాదాపు 50 మీటర్లు ఈడ్చుకుపోయింది అని అక్కడ ఉన్న ప్రత్యక్ష షాక్షులు చెపుతున్నారు. ఇక అక్కడికి చేరిన తన కుటుంబ సభ్యులు రఘు బాబు పై ఆందోళన చేసారు, రఘు బాబు తప్పేమి లేకపోవటంతో పోలీసులు వారిని శాంతిపచేసారు.