Home Cinema Aamani: విప్పి చూపించు అది కరెక్ట్ గా ఉందొ లేదో చూస్తాను అన్న డైరెక్టర్..

Aamani: విప్పి చూపించు అది కరెక్ట్ గా ఉందొ లేదో చూస్తాను అన్న డైరెక్టర్..

Senior Actress Aamani: ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొంతమంది హీరోయిన్స్ ని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొంతమంది దర్శక నిర్మాతలు మరియు పలువురు హీరోలు ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొంతమంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగా అడిగిన కోరికలు తీర్చి అవకాశాలు సంపాదించగా, మరికొంతమంది మాత్రం వచ్చిన దారిలో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే కొంతమంది హీరోయిన్స్ ని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వాడుకొని, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు ఇవ్వకుండా వదిలేసినా వాళ్ళు ఉన్నారు.

aamani-senior-actress-about-thaat-director

వారి పై న్యాయ పోరాటం చేస్తూ కొంతమంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి తమ గోడుని వినిపించారు కూడా. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ గా కొనాగుతున్న కొంతమంది, అలాగే సీనియర్ హీరోయిన్స్ కూడా గతం లో ఈ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురి అయిన వాళ్ళే. రీసెంట్ గా సీనియర్ హీరోయిన్ ఆమని(Senior Actress Aamani) తనకి ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో కొంతమంది దర్శక నిర్మాతలు మరియు వారి మ్యానేజర్లు మాట్లాడే కొన్ని మాటలు నాకు అసలు అర్థం అయ్యేవి కావు.

సినిమాలో తీసుకున్నాక డైరెక్టర్ గారు మీతో ఒకసారి మాట్లాడాలి అనేవారు. ఒక్కోసారి మన సినిమా ఫైనాన్స్ చేసే వ్యక్తి చూడాలి అనేవారు. సినిమా అన్న తర్వాత హీరో, డైరెక్టర్ లేదా నిర్మాత నన్ను చూడాలి అనుకోవడం లో తప్పు, ఫైనాన్సియర్ చూడాలి అనుకోవడం ఏమిటి అని నాకు అనుమానం వచ్చింది. ఒక మ్యానేజర్ వచ్చి మీరు ఫైనాన్సియర్ ని కలవాలి, ఒంటరిగా రండి, మీ అమ్మ ని తీసుకొని రాకండి అన్నాడు. నాకు అర్థం అప్పటికే విషయం అర్థం అయిపోయింది. అలా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో చాలానే జరిగాయి. ఒక సినిమా షూటింగ్ సమయం లో స్విమ్మింగ్ పూల్ సన్నివేశం ఉంటుంది.

నన్ను ఆ సినిమా డైరెక్టర్ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లేముందు మొత్తం విప్పేయండి. నేను స్ట్రెచెస్ ఏమైనా ఉన్నాయో లేదో చూడాలి అన్నాడు. నేను వెంటనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి బయటకి వచ్చేసాను. అలా కెరీర్ ప్రారంభం నాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తాయి, కానీ నేను దేనికి ఒప్పుకోలేదు. నా సొంత టాలెంట్ తోనే నేను ఇక్కడి దాకా వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది ఆమని. ఇపుడు మాత్రమే కాదు తాను గతంలో కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి ఎన్నో సార్లు చెప్పుకు వచ్చింది సీనియర్ నటి ఆమని.

Exit mobile version