Home Cinema Laya: ఆ పాన్ ఇండియా సినిమాలో మంచి ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ లయ.. సినిమాల్లోకి...

Laya: ఆ పాన్ ఇండియా సినిమాలో మంచి ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్ లయ.. సినిమాల్లోకి రీఎంట్రీ..

Laya: ఇండస్ట్రీ చక్కగా చీర కట్టుకొని సంప్రదాయబద్ధంగా ఉండే హీరోయిన్స్ కి కెరీర్ ఉండదు అని అందరూ అంటూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ టాలెంట్ ఉంటె చాలు, అందాలు ఆరబొయ్యకపోయిన కూడా ఇండస్ట్రీ లో స్టార్ స్టేటస్ ని సంపాదించగలం అని నిరూపించారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు లయ. ‘భద్రం కొడుకో’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన లయ, ఆ తర్వాత వేణు తొట్టెంపూడి హీరో గా నటించిన ‘స్వయంవరం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.

laya

ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో లయ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించి, అందులో 80 శాతం సక్సెస్ రేట్ ని అందుకుంది. కెరీర్ అలా పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లో లయ(Laya) గణేష్ అనే అతనిని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత ఈమె చాలా కాలానికి రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాలో లయతో పాటుగా ఆమె కూతురు కూడా నటించింది.

సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో లయ మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఇంస్టాగ్రామ్ లో తన కొడుకు మరియు కూతురుతో రీల్స్ చేస్తూ కనపడే లయ, ఈమధ్య కాలం లోనే ఇండియాలోకి మళ్ళీ అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె సినిమాల్లోకి మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి ని చూపిస్తుంది. అది కూడా చిన్న సినిమాలో కాదు, ఏకంగా మెగా పవర్ స్టేర్ రామ్ చరణ్ సినిమాలో అన్నమాట. ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్ , ఈ సినిమా పూర్తి అవ్వగానే బుచ్చి బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది, ఇందులో లయ ఒక ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తుంది. నటన కి పూర్తి ప్రాధాన్యత ఉన్న ఈ పాత్ర చెయ్యడం వల్ల లయ సెకండ్ ఇన్నింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ప్రారంభం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది. మరికొన్ని సినిమా అవకాశాలు వస్తే అమెరికా వదిలి మల్లి ఇండియా వచ్చి సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉంది అంట లయ. చూదాం మరి తినకు సెకండ్ ఇన్నింగ్స్ ఎలా కలిసొస్తుందో.

Exit mobile version