Mahesh Babu: ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి జీవించే హీరోల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. అతి తక్కువ మాటలు, ఎక్కువ యాక్టింగ్, హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో ఉండే హీరో ఆయన. అందుకే ఆయనకి అంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. హిట్టు/ ప్లాప్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు నటించిన ప్రతీ సినిమాని మనం చూడవచ్చు(Mahesh Babu Without Makeup). కేవలం ఆయన యాక్టింగ్ టాలెంట్ వల్లనే ఆ సినిమాలకు అలాంటి వేల్యూ వస్తుంది. హీరో గా మారకముందు బాలనటుడిగానే ఆయనలోని టాలెంట్ ఏంటో అందరికీ చూపించాడు.
ఆ తర్వాత రాజకుమారుడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ, మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, మహర్షి ఇలా ఒక్కటా రెండా, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. తన పేరునే ఒక బ్రాండ్ ఇమేజి గా చేసుకున్నాడు. ఇకపోతే మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు కూడా టీవీ టెలికాస్ట్ లో మంచి ఆదరణ దక్కించుకున్నాయి(Mahesh Babu Without Makeup). అలాంటి సినిమాలలో ఒకటి ‘నిజం’. చిత్రం,నువ్వునేను,జయం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ తేజ, ఒక్కడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు కలిసి చేసిన సినిమా ఇది.
అప్పట్లో మితిమీరిన అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్లాప్ గా నిల్చింది. కానీ నటన పరంగా మహేష్ బాబు కి మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఇలాంటి వైవిద్యభరితమైన పాత్రలు మహేష్ బాబు తప్ప ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఎవరూ చెయ్యలేరు అని అందరి చేతా అనిపించేలా చేసింది ఈ చిత్రం. ఈ సినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ హీరో గా కొనసాగుతున్న గోపీచంద్ విలన్ గా నటించాడు. సీనియర్ హీరోయిన్ రాశీ కూడా ఇందులో విలన్ గా నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.
అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్క సన్నివేశం లో కూడా మేకప్ వేసుకోలేదట. మాకెల్ప్ లేకుండానే ఆయన సినిమా మొత్తం చేసినట్టుగా డైరెక్టర్ తేజ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. సహజత్వానికి దగ్గర గా ఉండేలాగా కనిపించాలి కాబట్టి మహేష్ బాబు ఈ మేకప్ వేసుకోకూడదు అని అనుకున్నాడట. చూసే ఆడియన్స్ కి కూడా మహేష్ బేబీ లుక్ చాలా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.