Home Cinema Sreeleela : సినిమా అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న శ్రీలీల.. అదేంటో తెలుసుకోవాలంటే..

Sreeleela : సినిమా అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న శ్రీలీల.. అదేంటో తెలుసుకోవాలంటే..

Sreeleela : ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు. అయితే వారిలో కొందరికే మంచి గుర్తింపు లభిస్తుంది. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రవితేజ నటించిన ధమాకా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ, మహేష్ బాబు, నితిన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.

ఈ అందాల భామ చివరి చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం అంతంత మాత్రమే ఆడింది. దీనితో శ్రీలీలకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమా ఛాన్సులు లేకపోవడంతో శ్రీలీలే సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ వంటి ఈవెంట్‌లకు హాజరవడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది.

sreeleela-doing-this-kind-of-work-for-money-as-she-not-getting-cinema-offers

రీసెంట్‌గా ఓ మాల్ ఓపెనింగ్‌కి హాజరైన శ్రీలీల, ఆ ఈవెంట్‌కి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది సినిమాలు లేక ఈ పని చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా శ్రీలీలే మల్లి సినిమాలలో బిజీ అయిపోయి, ఇంతకుముందులా దూసుకుపోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version