Home Cinema Sivaji : చిరంజీవితో పోలిస్తే బాలకృష్ణ చిన్న నటుడు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు..

Sivaji : చిరంజీవితో పోలిస్తే బాలకృష్ణ చిన్న నటుడు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు..

Sivaji : ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోలకు స్నేహితుడిగా, కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తూ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు శివాజీ. ఆయన హీరోగానే కాదు, రాజకీయాల్లో ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తాడు. అయితే శివాజీ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ బిగ్ బాస్ 7తో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ఈ రియాలిటీ షో ముగిసిన వెంటనే, 90s అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చాడు. ఇది మంచి సక్సెస్ అందుకొని బుల్లితెరపై ఓ మార్క్ ను సృష్టించ్చింది.

దీనితో అతని దశ మారిందని చెప్పవచ్చు. అతను అద్భుతమైన నటన మల్లి మన అందరికి గుర్తుచేశాడు. అయితే అప్పట్లో బాలకృష్ణ – చిరంజీవి గురించి శివాజీ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలో నేను చాలా సినిమాల్లో హీరోగా కనిపించాను అని శివాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ నేను మెగాస్టార్‌ని కాలేకపోయాను. నేనే కాదు బాలకృష్ణ లాంటి హీరో కూడా మెగాస్టార్ కాలేకపోయాడు. చాలా మంది హీరోలు తమ సినిమాలు హిట్ అయినా మెగాస్టార్‌ అవ్వలేకపోయారు.

sivaji-sensational-words-defaming-balakrishna

ఇక బాలకృష్ణలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బాలకృష్ణ విషయంలోనూ అదే జరిగింది. టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు. ఎందుకో తెలియదు, కాలమే నిర్ణయిస్తుంది. ప్రభాస్ మెగాస్టార్‌డమ్‌ను మించిన నటుడిగా ఎదిగాడు. అయితే టాలెంట్ ఉంటే ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు నిరూపించుకోవాలి. అయితే, బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని సినిమాల్లో ఓడించలేరు అని, అంతేకాదు చిరంజీవి ముందు బాలకృష్ణ చాలా చిన్న నటుడు అన్నట్లు శివాజీ వ్యాఖ్యానించడం అభిమానులకు నచ్చలేదు.

Exit mobile version