Home Cinema Sreeleela : సినిమా అవకాశాలు తగ్గే సరికి అలాంటి చెత్త యాడ్స్ చేస్తున్న శ్రీలీల..

Sreeleela : సినిమా అవకాశాలు తగ్గే సరికి అలాంటి చెత్త యాడ్స్ చేస్తున్న శ్రీలీల..

Sreeleela : పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ అమ్ముడు ఆ తరువాత ధమాకా అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకుంది ఇక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ఐపోయింది. మంచి సక్సెస్ అందటంతో అమ్ముడికి తెగ మూవీ ఆఫర్లు వచ్చేసాయి. ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టాప్ హీరోతో డైరెక్టర్ తో శ్రీలీల పని చేసింది. కొంత కాలం ముందు వరకు అందరి కళ్ళు శ్రీలీల మీదే.

డేట్స్ కూడా కాళీ ఉండేవి కాదు అంత బిజీ ఉండేది కానీ మెల్లిగా అది మారుతూ వస్తుంది, శ్రీలీల(Sreeleela) చేసిన లాస్ట్ 4 సినిమా ఫట్ మనటంతో అమ్ముడికి సినిమా ఆఫర్లు రావటం తగ్గిపోయాయి. ఈ ఏడాది మహేష్ బాబు(Mahesh Babu) తో కలిసి గుంటూరు కారణం అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కానీ ఆ సినిమా అభిమానులని అంతగా ఆకట్టుకోలేక పోయింది అనే చెప్పాలి. అప్పటినుండి ఇక కొత్త సినిమా ఆఫర్లు ఏమి రాలేదు శ్రీలీలకు.

sreeleela

ప్రస్తుతం తన చేతిలో కేవలం 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఒక పక్క చదువుకుంటూ మరో పక్క కొన్ని కమర్షియల్ యాడ్లు చేస్తూ శ్రీలీల బాగానే డబ్బు సంపాదిస్తుంది. తాజాగా తను శ్రీ చైతన్య స్కూల్ కోసం చేసిన ఒక యాడ్ నెట్టింట దుమారం లేపుతుంది. ఈ యాడ్ శ్రీలీల తన అకౌంట్ లో పోస్ట్ చేసినప్పటి నుండి అందరూ తెగ ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు అంటే ప్రజలకు ఉన్న చులకన భావనే.

Exit mobile version