Home Cinema ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్.. వీడియో వైరల్..

ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్.. వీడియో వైరల్..

సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత గొప్ప పేరుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. గత రెండు దశ్శబడలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఇంతటి గొప్ప పేరున్న ఎన్టీఆర్ పై ఓ స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్ చేసారు. ఎన్టీఆర్ (Krishna vamshi about Jr NTR) ఒక రాక్షసుడు అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్నారా? ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ.

star-director-krishna-vamshi-sensational-comments-on-jr-ntr

కృష్ణ వంశీ ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఒక్కే ఒక చిత్రం రాఖీ. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయిన ఎన్టీఆర్ పెరఫామెన్స్ మరియు డైలాగ్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు కృష్ణ వంశీ. ఆ ఇంటర్వ్యూలో ఆయన రాఖీ సినిమా రోజులు గుర్తు చేసుకొని, ఎన్టీఆర్ (Krishna vamshi about Jr NTR) గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసారు. రాఖీ సినిమా క్లైమాక్స్ లో లెన్తీ డైలాగ్ సింగిల్ టేక్ లో చేసాడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.

పని పరంగా అతనో రాక్షసుడు అని ఆయన అన్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతోంది. కొందరు ఎన్టీఆర్ అభిమానులు వీరిద్దరూ మల్లి కలిసి పని చేస్తే చూడాలని ఉందంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎన్టీఆర్ కూడా కృష్ణ వంశీని కలిసిన ప్రతిసారి మంచి కథ ఉంటె చెప్పు చేదాం అని అంటారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా మన ముందుకు రాబోతుంది.

Exit mobile version