Home Cinema Naga Chaitanya : ఆ కారణంతోనే నాగచైతన్య సరసన నటించడానికి నో చెప్పిన స్టార్ హీరోయిన్..

Naga Chaitanya : ఆ కారణంతోనే నాగచైతన్య సరసన నటించడానికి నో చెప్పిన స్టార్ హీరోయిన్..

Naga Chaitanya : ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న నాగ చైతన్యతో సినిమా చేయడానికి నిరాకరించింది. అక్కినేని నాగార్జున కొడుకు అని తెలిసినా నాగ చైతన్యతో సినిమా చేయలేనని దర్శకులకు సూటిగా చెప్పేసిందట. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు చైతన్యతో నటించే అవకాశాన్ని కాదనుకుందట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ హీరోయిన్ ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఆ నటి మరెవరో కాదు రష్మిక.

రష్మిక మందన్న నాగ చైతన్యతో సినిమా చేయలేనని చేతులెత్తేసింది. అవును మీరు వినేది నిజమే. ఈ ఇద్దరి కంబినేషన్లో రావలిసింది చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరక్కిక్న ఈ చిత్రంలో మొదట కథానాయికగా రష్మిక అని భావించారు. అయితే ఈ భామ కాల్ షీట్స్ సెట్ కాకపోవడంతో ఆమె నిరాకరించింది. దీని తరువాత, “కస్టడీ” చిత్రంలో నటించే అవకాశం ఈ బ్యూటీకి దక్కింది. కానీ ఆమె నిరాకరించడంతో ఆ అవకాశం కృతి శెట్టికి దక్కింది. నాగచైతన్య సరసన నటించడానికి రష్మికకు వచ్చిన రెండో అవకాశం ఇది.

star-heroine-rashmika-mandanna-rejected-movie-offers-with-naga-chaitanya-wantedly

కానీ ఏమైందోఏమో రష్మిక రిజెక్ట్ చేసిందట. చివరగా, చందు మొండేటి దర్శకత్వం వహించే చిత్రంలో సాయి పల్లవి స్థానంలో రష్మికను అనుకున్నారు. పుష్ప 2లో రష్మిక సహజ రూపంలో కనిపిస్తాను అందుకే ఈ పాత్రలో నేను నటించలేను. ఇలాంటి పాత్రలు చేస్తే నా కెరీర్ దెబ్బతింటుంది అని చెప్పి దర్శకుడు ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించింది ఈ బ్యూటీ. ఇపుడు ఈ వార్తా సోషల్ మిడిల్ వైరల్ అవుతుంది మరియు ఇది విన్న అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version