Home Cinema Surekha Vani: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న తల్లి కూతురులు.. సురేఖ సుప్రీతా బిగ్...

Surekha Vani: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న తల్లి కూతురులు.. సురేఖ సుప్రీతా బిగ్ బాస్ ఎంట్రీ..

Surekha Vani Big Boss: మరికొద్ది రోజుల్లో స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి రెండు ప్రోమోలను విడుదల చేసారు. ముందు సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జున ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. ముందు సీజన్స్ లో లాగ ఈ సీజన్ ఉండదు, సరికొత్త రూల్స్, సరికొత్త విధానాలతో మీ ముందుకు రాబోతున్నాము, కంటెస్టెంట్స్ ఏదైనా ప్లేన్స్ తో వస్తున్నట్టు అయితే వెంటనే విరమించుకోండి, మీరు ఊహించని విధంగా ఈసారి గేమ్ ఉండబోతుంది అంటూ నాగార్జున చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

surekha-vani-daughter-supritha-big-boss

అంత కఠినంగా ఏమి రూల్స్ ఉండబోతున్నాయి..? ‘ఉల్టా పల్టా’ అని నాగార్జున ఎందుకు అన్నాడు అంటూ సోషల్ మీడియా లో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా లో అనేక రకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ముందు సీజన్ లో లాగ కాకుండా, ఈసారి జరగబోయే సీజన్ లో మంచి పాపులారిటీ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ని మాత్రమే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సురేఖ వాణి మరియు ఆమె కూతురు సుప్రీతా ని బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు,

వాళ్ళిద్దరి కలిసి ఈ షో లో ప్లాగొనేందుకు ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి(Surekha Vani Big Boss). ఈ ఇద్దరికీ సోషల్ మీడియా లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంస్టాగ్రామ్ లో తమకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు రీల్స్ తో కుర్రకారులకు పిచ్చేక్కిస్తుంటారు. లైఫ్ ని ఎంత ఎంజాయ్ చెయ్యాలి అనేది వీళ్ళని చూసి అర్థం చేసుకోవచ్చు. చాలా పోష్ గా జీవితాన్ని గడుపుతూ, పార్టీలకు పబ్బులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే కాదు తమ మీద ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం ఈ ఇద్దరు చాలా బోల్డ్ గా సమాధానం ఇవ్వడం వంటివి ఇది వరకు మనం ఎన్నో సార్లు చూసాము.

అలా బోలెడంత కంటెంట్ తో పాటు అద్భుతమైన ఫాలోయింగ్ కూడా ఉండడం తో ఈ ఇద్దరినీ బిగ్ బాస్ యాజమాన్యం ఆహ్వానించింది అంటూ చెప్తున్నారు. ఇక పోతే ఈ సీజన్ ఈ నెల చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సురేఖ వాణి తన కూతురు ఇద్దరు ఇటీవలే డ్రగ్స్ విషయాల్లో కొన్ని ఆరోపణలు ఎదురుకున్నారు. కబాలి తెలుగు నిర్మాత కేపి చౌదరి అరెస్ట్ కేసులో ఆశు రెడ్డి తో పాటు సురేఖ వాణి తన కూతురు పేరులు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మొన్నే వీలు ఇలా చేస్తే ఇపుడు విలనీ బిగ్ బాస్ కు తీసుకు రావటం ఏంటి అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version