Home Cinema Tamannaah: ఆ స్టార్ హీరోల భార్యలు అంటే తమన్నా కు ఎందుకు అంత భయం..

Tamannaah: ఆ స్టార్ హీరోల భార్యలు అంటే తమన్నా కు ఎందుకు అంత భయం..

Tamannaah Afarid: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్స్ లో ఒకరు తమన్నా భాటియా. మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన తమన్నా, ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో తమిళం లో కొన్ని సినిమాలు చేసింది. అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు,ఇక తెలుగు లో ‘హ్యాపీ డేస్’ చిత్రం రీ ఎంట్రీ ఇచ్చి, గ్రాండ్ హిట్ ని అందుకొని వరుసగా స్టార్ హీరోల సరేనా నటిస్తూ ఇండస్ట్రీ లో అతి తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ గా ఎదిగింది.

tamannaah

తెలుగు , తమిళ భాషల్లో ఈమె దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక బాహుబలి సిరీస్ తో ఈమె పాన్ వరల్డ్ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టింది. అయితే తమన్నా కి కొంతమంది హీరోల భార్యలతో చాలా సమస్యలు ఎదురయ్యాయట. ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమా షూటింగ్ సమయం లో ప్రతీ రోజు లక్ష్మి ప్రణతి కూడా ఎన్టీఆర్ తో పాటుగా వచ్చేది అట. అప్పుడు ఎన్టీఆర్ – తమన్నా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు తీసేటప్పుడు లక్ష్మీ ప్రణతి చాలా ఇబ్బంది పడేది అట. తమన్నా ని చాలా కోపం గా చూసేది అట.

షూటింగ్ లొకేషన్ కి వచ్చినప్పుడు తమన్నా లక్ష్మి ప్రణతి ని పలకరిస్తే అసలు మాట్లాడేది కాదట. ఒకరోజు ఎన్టీఆర్ ఇంటికి తమన్నా వెళ్ళినప్పుడు లక్ష్మి ప్రణతికి వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి ఏడుపు వచ్చేసిందట. అప్పుడు ఎన్టీఆర్ ఇండస్ట్రీ లో ఇవన్నీ కామన్, అక్కడి పరిస్థితులు ఇలా ఉంటాయి అని అన్నీ ఆమెకి వివరించడం తో శాంతించింది అట. కానీ తమన్నా కి మాత్రం లక్ష్మీ ప్రణతి ని చూస్తే ఇప్పటికీ భయమే అని ఇండస్ట్రీ లో టాక్(Tamannaah Afarid). కేవలం లక్ష్మీ ప్రణతి మాత్రమే కాదు, అల్లు అర్జున్ భార్యా స్నేహ రెడ్డి, రాంచరణ్ భార్య ఉపాసన నుండి కూడా తమన్నా కి ఇలాంటి పరిస్థితులే ఎదురు అయ్యాయి అట.

వీళ్ళతో మాట్లాడేందుకు తమన్నా చాలా భయపడుతుందని, అందుకే ఈ హీరోలను ఈమధ్య కాలం లో కలవడమే మానేసిందని టాక్. ఇకపోతే తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూసి తమన్నా కి ఇలాంటి సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి అంట. తమన్నా కూడా ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలి అని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version